సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పె పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. గతంలో తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి ఎంతోమంది హీరోయిన్లు మీడియా ముందుకు వచ్చి ధైర్యంగా చెబుతున్నారు.
క్యాస్టింగ్ కౌచ్ గురించి తెలియని వారు ఉండరు. సినీ ఇండస్ట్రీలో పట్టి పీడిస్తున్న ఓ మహమ్మారి. సినీ రంగంలో అవకాశాల కోసం కొంతమంది పడకగదికి పిలిపించుకునే ప్రక్రియనే క్యాస్టింగ్ కౌచ్ అంటారు. ఇది కేవలం సినీ ఇండస్ట్రీలోనే కాదు.. ఇతర రంగాల్లోనూ మహిళలను వేధిస్తున్న సమస్య. ఇటీవల సినీ రంగానికి చెందిన హీరోయిన్లు క్యాస్టింగ్ కౌచ్ మాట్లాడుతున్నారు. తాజాగా ప్రముఖ నటి మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. వివరాల్లోకి వెళితే..
కోలీవుడ్ లో బుల్లితెరపై తనదైన యాంకరింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి ప్రియాభవాని శంకర్ తర్వాత వెండితెరపై హీరోయిన్ గా తనదైన ముద్ర వేసింది. ప్రస్తుతం ఈ అమ్మడికి చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. వాస్తవానికి ప్రియాభవాని శంకర్ మొదటి చిత్రం మేయాదమాన్ పెద్దగా సక్సెస్ సాధించలేదు. దీంతో ఆ అమ్మడిది ఐరన్ లెగ్ అంటూ ప్రచారం చేసేందుకు ఓ వర్గం రెడీగా ఉన్నట్లు ఇండస్ట్రీ టాక్. అయితే హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది ప్రియాభవాని శంకర్. ప్రస్తుతం ఈ అమ్మడికి పెద్ద ప్రాజెక్ట్స్ లో అవకాశాలు వచ్చాయి.. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటిస్తున్న ఇండియన్ 2, ఎస్ జే సూర్య సరసన బొమ్మై చిత్రాల్లో నటిస్తుంది.
ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో ప్రియాభవాని శంకర్ మాట్లాడుతూ.. ‘సినీ రంగంలో ఎంతోమంది నటీమణులు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. ఇటీవల తమకు జరిగిన అన్యాయాల గురించి చాలా మంది హీరోయిన్లు బహిరంగంగా మాట్లాడుతున్నారు. మహిళలపై లైంగిక వేధింపులు కేవలం సినీ రంగంలోనే కాదు.. అన్ని రంగాల్లో ఉన్నాయి. అలాంటి వారు తమకు జరిగే అన్యాయాల గురించి ధైర్యంగా బయటకు చెప్పాలి.. వారు చెప్పేది సమాజం వినాలి. తమకు జరిగిన అన్యాయాల గురించి మాట్లాడితే హేళనగా చూడటం మానుకోవాలి.. తమపై జరిగిన అన్యాయాల గురించి అప్పుడే స్పందించాలి.. ఇప్పుడు చెబుతున్నారేంటీ అని విమర్శించకూడదు.. లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ గొంతు విప్పాలి’ అని అన్నారు. ప్రియాభవాని శంకర్ నటించిన బొమ్మై మూవీ ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.