రైతులకు మరో శుభవార్త చెప్పేందుకు కేసీఆర్ సర్కార్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రైతుల కోసం మరో అద్భుత పథకాన్ని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. రైతు బంధు, రైతు బీమా తోపాటు కొత్తగా రైతుల కోసం పింఛను కూడా ప్రారంభించాలని యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రైతుల కోసం కొత్త స్కీమ్లు రాబోతున్నాయని.. తెరాస వర్గాలు ఎప్పటినుంచో చెబుతున్న విషయం తెలిసిందే. కొండపోచమ్మ సాగర్ ప్రారంభం సమయంలో రైతులకు ఓ శుభవార్త చెబుతాని కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పలు కారణాల వల్ల అది ఆలస్యమైంది.
రైతు పింఛన్ విధివిధాలను ఖరారు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ప్రస్తుతం గీత కార్మికులకు 50 ఏళ్లు నిండిన వారికి పింఛను ఇస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అంత కన్నా వయోపరిమితి రెండేళ్లు తగ్గించాలని సీఎం ఆదేశించినట్లు తెలుస్తోంది. వీలైనంత ఎక్కువ మందికి లబ్ధి చేకూరేలా పథకం ఉండాలని సీఎం ఆదేశించడంతో.. వయోపరిమితి 47- 49 మధ్య నిర్ణయిస్తారని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ పథకాన్ని వచ్చే బడ్జెట్ తయారీ సమయానికి సిద్ధం చేయాలని సూచించినట్లు సమాచారం.
చిన్న, సన్నకారు రైతులకు నెలకు రూ.2016 పింఛనుగా ఇవ్వాలని.. 3 నుంచి 5 ఎకరాల మధ్య ఉన్న రైతులకు వర్తింపజేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో రైతుబంధు అందుకుంటున్న దాదాపు 67 లక్షల మంది రైతుల్లో ఈ పథకం ఎంత మందికి వర్తింస్తుంది అనే విషయం తెలియాల్సి ఉంది. ఫైనాన్స్ డిపార్టమెంట్ ఈ పథకంతో ఖజానాపై ఆర్థిక భారం ఎంత పడుతుంది అనే అంశంపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరలోనే ఈ పథకం రైతులకు అందనున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.