Kalvakuntla Kavitha : తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ముద్దుల తనయ, మంత్రి కేటీర్ గారాల చెల్లెలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. అవసరం అనుకున్న విషయాలను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేస్తుంటారు. తాజాగా, ఆమె తనకు బాగా నచ్చిన, ఇన్‌స్పైర్ చేసిన ఓ దృశ్యం తాలూకా వీడియోను బుధవారం తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ‘‘ స్పూర్తిదాయకమైన తల్లీకూతళ్లు.. ఈరోజు నానక్ రామ్ గూడ చౌరస్తా దగ్గర.. హెల్మెట్ ధరించండి.. సేఫ్‌గా ఉండండి’’ అని రాసుకొచ్చారు. ఆ వీడియోలో కవిత కారు ముందు ఓ స్కూటీ వెళుతోంది. కారులోంచి కవిత? ముందు పోతున్న స్కూటీని వీడియో తీస్తూ ఉంది. కొద్దిసేపటి తర్వాత కారు స్కూటీ దగ్గరకు వచ్చింది. కారులోంచి ఆమె స్కూటీపై వెళుతున్న తల్లీకూతుళ్లను వీడియో తీస్తూ ఉంది. ఆ తల్లీ కూతుళ్లు ఇద్దరూ హెల్మెట్ పెట్టుకుని ఉన్నారు.
స్కూటీపై ఉన్న తల్లి కారులోకి చూసి, పక్కకు తిరిగింది. అనంతరం కారు స్కూటీని ఓవర్‌టెక్ చేసి ముందుకు వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నలభై వేలకు పైగా వ్యూస్ సంపాదించుకుంది. కవిత ట్వీట్ చేసిన ఈ వీడియో… స్కూటీపై వెళుతున్న మహిళ భర్తకు కూడా చేరింది. ఆయన పేరు డేనియల్.. ఆమె పేరు శాంతి డేనియల్, కూతురు పేరు శారా డేనియల్. డేనియల్ ట్విటర్‌లో స్పందిస్తు.. వీడియోను షేర్ చేసి భద్రతను పెంపొందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశాడు. తన భార్యపేరు, కూతరుపేరు చెప్పాడు. భార్యాకూతురికి సంబంధించిన రెండు ఫొటోలు షేర్ చేసి.. వాళ్లే తన ప్రపంచం అని చెప్పుకొచ్చాడు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Inspiring Mother & Daughter duo I ran into at Nanakram guda chourastha today !!!
Wear Helmet & Be safe 😊🙏🏻 pic.twitter.com/0RfV6Bj2rH— Kavitha Kalvakuntla (@RaoKavitha) March 23, 2022
ఇవి కూడా చదవండి : వీడియో: పాదయాత్రలో YS షర్మిలపై తేనెటీగల దాడి
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.