సాయిధరమ్‌ తేజ్‌ కాలర్‌ బోన్‌ సర్జరీ ఎప్పుడంటే?

saiteja accident

సుప్రీం హీరో, మెగాస్టార్‌ మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ ఆరోగ్యం నిలకడగా ఉంది. వైద్యానికి స్పందిస్తున్నారని వైద్యులు తెలిపిన విషయం తెలిసిందే. ప్రస్తుతానికి కూడా సాయిధరమ్ తేజ్‌ వెంటిలేటర్‌పైనే ఉన్నాడు. అది ముందుజాగ్రత్త కోసమే అని వైద్యులు తెలిపారు. తేజ్‌ బైక్‌ పైనుంచి పడిన సమయంలో అతని కాలర్‌ బోన్‌ ఫ్యాక్చర్‌ అయ్యింది. అది కూడా పెద్దగా భయపడాల్సిన విషయం కాదని వైద్యులు తెలిపారు. డాక్టర్‌ అలోక్‌ రంజన్‌, అతని బృందం పర్యవేక్షణలో సాయిధరమ్‌ తేజ్‌కు చికిత్స జరుగుతోంది.

తాజా హెల్త్‌ బులిటెన్‌లోనూ సాయి ధరమ్ తేజ్‌ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు స్పష్టం చేశారు. మరో 24 గంటలు వెంటిలేటర్‌పైనే సాయిధరమ్‌ తేజ్‌ ఉంటాడని తెలిపారు. కాలర్‌ బోన్‌ శస్త్రచికిత్సకు సంబంధించి ఆదివారం ఓ నిర్ణయం తీసుకుంటామని వైద్యులు వెల్లడించారు. అప్పటికప్పుడు హుటాహుటిన చేయాల్సిన సర్జరీ కాదనే.. సమయాన్ని బట్టి చేసేందుకు ఆలోచిస్తున్నట్లు తెలిపారు. వినాయక చవితి రోజు రాత్రి 8 గంటల సమయంలో సాయిధరమ్‌ తేజ్‌కు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో తేజ్‌ చికిత్స జరుగుతోంది.