నిస్వార్థ ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ యువకుడు చేసిన పనికి సెల్యూట్ చేయాల్సిందే!

Vanasthali Puram Hyderabad Telangana

ఈ మధ్యకాలంలో కొందరు యువకులు ప్రేమిస్తున్నానంటూ అమ్మాయిల వెంటపడటం, ఆ తర్వాత అన్ని కోరికలు తీర్చుకుని ఎడమొహం పెట్టడం చేస్తున్నారు. ఇదే నేటి కాలంలో కొందరు దుర్మార్గాలు ప్రేమ పేరుతో చేస్తున్న మోసాలు. ఇక ఇంతటితో ఆగకుండా ప్రేమకు ఒప్పుకోకపోతే బెదిరింపులు దానిని దాటిపోయి హత్యలు కూడా చేస్తున్న ఘటనలు చాలానే చూస్తున్నాం. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఓ యువకుడు మాత్రం మనసుపడిన దివ్యాంగురాలిని పెళ్లి చేసుకుని నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఈ యువకుడు చేసిన పనికి ఇప్పుడు అంతా సెల్యూట్ చేస్తున్నారు.

ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని ఇల్లందుకు చెందిన వసంతరావు అనే యువకుడు నరసమ్మ అనే దివ్యాంగురాలిపై మనసు పడ్డాడు. నరసమ్మ కూడా వసంతరావు మాటను పక్కకు పెట్టకుండా సరేనంది. ఇద్దరు కొన్నాళ్ల పాటు మాట్లాడుకుని ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. ఇక పెళ్లి చేసుకుందామని భావించి ఇద్దరు తల్లిదండ్రుల వద్దకు వెళ్లారు. వీరి మాటలకు ఇరువురి తల్లిదండ్రులు అంగీకరించలేదు.

కుటుంబ సభ్యులు వద్దని చెప్పినా ఆ యువకుడు మాత్రం దివ్యాంగుల సంఘాన్ని ఆశ్రయించాడు. దీంతో వీరు వీళ్ల ప్రేమను అంగీకరించి పెళ్లికి సహకరించారు. ఇక స్థానికంగా ఉండే రుద్రంపూర్ లోని దేవాలయంలో నరసమ్మ మెడలో మూడు వసంతరావు మూడు ముళ్లు వేశాడు. గుడి నుంచి దివ్యాంగురాలైన నరసమ్మను ఎత్తుకుని నడుచుకుని వస్తుంటే నిస్వార్ధ ప్రేమకు ఈ జంటే నిలువెత్తు నిదర్శనం అంటూ అందరూ ఆ యువకుడిని అభనిందిస్తున్నారు. ఎలాంటి స్వార్ధం లేని ఈ యువకుడి నిస్వార్థ ప్రేమపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.