శివ శంకర్ మాస్టర్ కోసం రంగంలోకి దిగిన సోనూ సూద్, హీరో ధనుష్

హైదరాబాద్- శివ శంకర్ మాస్టర్.. సినీ ప్రేక్షకులకు ఈ కొరియో గ్రాఫర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వంద సినిమాల్లో ఎన్నో పాటలను శివ శంకర్ మాస్టర్ డ్యాన్స్ కంపోజ్ చేశారు. కరోనా సోకడంతో శివ శంకర్ మాస్టర్ హైదరాబాద్ లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నరు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. 75 శాతం మేర శివ శంకర్ మాస్టర్ ఊపరితిత్తులు ఇన్ ఫెక్షన్‌కు గురయ్యాయి.

శివ శంకర్ మాస్టర్‌ కు మాత్రమే కాకుండా ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకింది. శివ శంకర్ మాస్టర్ పెద్ద కొడుక్కి కూడా కరోనా సోకగా, ఆయన ఆరోగ్యం కూడా విషమంగా ఉందని తెలుస్తోంది. అంతే కాదు శివ శంకర్ మాస్టర్ భార్యకు కూడా కరోనా సోకగా ఆమెకు హోమ్ క్వారెంటైన్ లో ఉంది. శివ శంకర్ మాస్టర్ ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో హాస్పిటల్ ఖర్చులు ఇప్పుడు భారంగా మారాయి.

Sonu Sood 1

అందుకే శివ శంకర్ మాస్టర్ చిన్న కొడుకు అజయ్ కృష్ణ దాతల సాయం చేయాలని కోరాడు. ఈ నేపధ్యంలో ప్రముఖ నటుడు సోనూ సూద్, తమిళ హీరో ధనుష్ స్పందించారు. శివ శంకర్ మాస్టర్ అజయ్ కృష్ణ దాతల సాయం అర్ధించగానే.. రియల్ హీరో సోనూ సూద్ అందరికంటే ముందుగా రియాక్ట్ అయ్యారు. వెంటనే శివ శంకర్ మాస్టర్ కు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు.

వెంటనే ఆయన కొడుకుతో మాట్లాడారు సోనూ సూద్. శివ శంకర్ మాస్టర్ ను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాను చెప్పారు. మరోవైపు తమిళ హీరోక ధనుష్ సైతం స్పందించారు. శివ శంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. మాస్టర్ వైద్య ఖర్చులు భరిస్తానని హామీ ధనుష్ హామీ ఇచ్చినట్టు సమాాచారం. శివ శంకర్ మాస్టర్ త్వరగా కోలుకోవాలని పలువురు సినీ ప్రముఖులు, ఆయన అభిమానులు ప్రార్ధిస్తున్నారు.