ప్రియాంక చోప్రా- నిక్ జోనస్ విడాకులు తీసుకోబోతున్నారా

ఇంటర్నేషనల్ డెస్క్- సినీ సెలబ్రెటీల వివాహాలు, విడాకులు సర్వ సాధారణం. ఎప్పుడు ఎవరు ఎవరిని పెళ్లి చేసుకుంటారో, వాళ్లు ఎప్పుడు విడిపోతారో ఎవ్వరికి తెలియదు. చాలా వరకు సినీ, క్రీడా ప్రముఖుల పెళ్లి బంధాలు ఎక్కువ సమయం నిలువలేవనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. టాలీవుడ్ నుంచి మొదలు హాలీవుడ్ వరకు చాలా జంటలు మధ్యలోనే తమ వివాహ బంధానికి స్వస్తి చెప్పిన ఘటనలను మనం ఎన్నో చూశాం.

ఈ క్రమంలోనే గ్లోబల్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా త‌న భ‌ర్త నిక్ జోన‌స్ నుంచి విడిపోనుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందుకు గత కొన్ని రోజులుగా ప్రియాంక చోప్రా వ్యవహరిస్తున్న వ్వహార శైలే కారణమని అంటున్నారు. ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ ఎంతో అన్యోనంగా ఉండే వాళ్లు. అమెరిక‌న్ సింగ‌ర్‌, కంపోజ‌ర్ అయిన నిక్ జోన‌స్‌ ను ప్రియాంక చోప్రా 2018లో పెళ్లి చేసుకుంది. త‌న‌కంటే సుమారు 12 ఏళ్లు చిన్న‌వాడైన నిక్‌ ను ప్రియాంక పెళ్లి చేసుకోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది.

Priyanka 1

నిక్ జోన‌స్‌, ప్రియాంక చోప్రా క్రిస్ట‌య‌న్ ప‌ద్ధ‌తిలో, హిందూ ప‌ద్ధ‌తిలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అయిన త‌ర్వాత ప్రియాంక ఇన్‌ స్టాగ్రామ్‌ లో త‌న పేరుని ప్రియాంక జోన‌స్‌ గా మార్చుకుంది. పెళ్లైనప్పటి నుంచి ఇద్ద‌రూ క‌లిసి చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగారు. ఇద్ద‌రి మ‌ధ్య అన్యోన్య‌త‌ను చూసి కుళ్లుకున్న‌వాళ్లున్నారంటే అతియోశక్తి కాదేమో. ఇదిగో మరి హఠాత్తుగా ఏమైందో తెలియదు కాని.. ప్రియాంక చోప్రాలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.

తాజాగా ప్రియాంక చోప్రా త‌న భ‌ర్త పేరును త‌న ఇన్‌ స్టాగ్రామ్ అకౌంట్ నుంచి తొల‌గించింది. రీసెంట్‌ గా ఆమె త‌న భ‌ర్త నిక్ జోన‌స్‌ తో క‌లిసి లాస్ ఏంజిల్స్‌లోని కొత్త ఇంటికి మకాం మార్చింది. అలా మార్చిందో లేదో ఇన్‌ స్టాలో త‌న భ‌ర్త పేరును తీసేసింది. అంతే కాదు, త‌న ఇన్‌ స్టాలో.. ప్ర‌తిదానికి మొద‌లంటూ ఒక‌టుంటుంది.. అంటూ ఓ క్యాప్ష‌న్ కూడా పెట్టింది ప్రియాంక చోప్రా. ఈ చ‌ర్య‌లపై బాలీవుడ్ వ‌ర్గాల‌కు అనుమానాల‌ు వ్యక్తం చేేస్తున్నాయి. నిక్ జోనస్, ప్రియాంక చోప్రా విడిపోతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.