అల్లు అర్జున్ తో కాదు.. అల్లు అర్హతో పూజా హెగ్డే స్పెప్పులు

ఫిల్మ్ డెస్క్- అల వైకుంఠపురములో.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బుట్ట బొమ్మ పూజా హెగ్డే కాంబినేషన్ లో, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులోను ఈ సినిమాలోని పాటలన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. చిన్న పిల్లలనుంచి మొదలు యువతకు, పెద్ద వాళ్లకు సైతం అల వైకుంఠపురములో సినిమా సాంగ్స్ తెగ నచ్చేశాయి.

మరీ ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ మూవీలోని బుట్టబొమ్మ, రాములో రాముల పాటకు సంబంధించిన కొన్ని కోట్ల వీడియోలు, రీల్ వీడియోలు, టిక్ టాక్ వీడియోలు వెల్లువెత్తాయి. మ్యూడిక్ డైరెక్టర్ తమన్ అల వైకుంఠపురములో సినిమాకు సంగీత పరంగా ప్రాణం పోశారని చెప్పాలి. అల్లు అర్జున్ స్టైలీష్ స్టెప్పులు, త్రివిక్రమ్ టేకింగ్ అన్నీ కలిపి సినిమాను బంపర్ హిట్ చేశాయి.

allu arjun daughrer

బుట్ట బొమ్మ పూజా హెగ్డే తాజాగా అల వైకుంఠపురములో సినిమాలోని పాటలకు సంబందించి కొన్ని పోస్ట్‌లు చేసింది. సినిమా రిలీజై రెండేళ్లు అయిన సందర్భంగా కొన్ని విషయాలను అభిమానులతో పంచుకుంది. నేను అల్లు అర్జున్ కలిసి చేసిన డ్యాన్స్‌ని చూశారు కదా.. ఇక ఇప్పుడు ఇది చూడండి.. నా షాట్ కోసం వెయిట్ చేసే ఖాళీ టైంలో అర్హతో డ్యాన్స్ చేశాను.. మాకు తెలీకుండానే బుట్టబొమ్మ స్టెప్పులను ఇద్దరం ముందే కనిపెట్టేశామేమో.. అని పూజా చెప్పుకొచ్చింది.

మనస్పూర్తిగా.. ఏ దురుద్దేశ్యం లేకుండా సినిమా తీస్తే.. జనాలను నవ్వించాలని, ఎంటర్టైన్ చేయాలని సినిమా తీస్తే కచ్చితంగా అద్బుతం జరుగుతుంది.. అని చెప్పుకొచ్చింది పూజా హెగ్డే. అంతే కదా మరి. పూజా హెగ్డే, అల్లు అర్హ స్టెప్పులను మీరూ చెస్సేయ్యండి.

 

View this post on Instagram

 

A post shared by Pooja Hegde (@hegdepooja)