హైదరాబాద్ నడి రోడ్డుపై రెండువేల నోట్ల కట్టలు.. ఎగబడ్డ జనం

హైదరాబాద్- ఎక్కడైనా రోడ్డుపై పది రూపాయల నోటు కనిపిస్తేనే ఠక్కున తీసుకోవాలని అనిపిస్తుంది. మరి అలాంటిది రెండి వేల రూపాయల నోటు కాదు.. ఏకంగా రెండు వేల రూపాయల నోట్ల కట్టలే రోడ్డుపై కనిపిస్తే ఎవరినై ఎందుకు ఊరుకుంటారు చెప్పండి. నోట్ల కట్టలేంటీ.. రోడ్డుపై పడటమేంటని అనుకుంటున్నారు కదా.. బుధవారం హైదరాబాద్ లో ఓ తమాషా ఘటన జరిగింది.

మాదాపూర్ వంద ఫీట్ల రోడ్డుపై సాయంత్రం పూట ట్రాఫిక్ సాఫీగా వెళ్తోంది. కాకతీయ రోడ్డులో రోడ్డు పక్కన నోట్టల కట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. అవన్నీ రెండు వేల రూపాయల కట్టలే. అంతే ఒక్కొక్కరుగా ఆ నోట్ల కట్టల దగ్గరకు వెళ్లి ఎవరికి తోచినంత వారు తీసుకెళ్లడం మొదలుపెట్టారు. అలా అంతా నోట్ల కట్టల కోసం ఎగబడటంతో అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది.

Hyderabad 1 1

స్థానికులతో పాటు, వాహన దారులు సైతం నోట్ల కోసం ఎగబడ్డారు. ఎవరికి అందిన కాడికి వారు తీసుకొని అక్కడ నుంచి వెళ్లిపోయారు. ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ముందైతే ట్రాఫిక్ ను క్రియల్ చేశాకు. అసలేం జరిగిందని పోలీసులు ఆరా తీస్తే ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది.

రోడ్డుపై పడి ఉన్న నోట్లను పోలీసులు పరిశీలించగా అవన్నీ నకిలీ నోట్లని తేలింది. సదరు రెండు వేల రూపాయల నోట్లు షూటింగ్ కోసం ఉపయోగించేవని చేల్చారు పోలీసులు. ఆ నోట్లపై చిల్డ్రన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అని ఉండడంతో వాటిని తీసుకున్న వారు తీవ్ర నిరాశకు గురయ్యారు. మొత్తానికి మాదాపూర్ లో కాసేపు హంగామా నడిచింది.