నా బిడ్డకు తండ్రి అతనే.. అసలు విషయం చెప్పిన నుస్రత్

స్పెషల్ డెస్క్- అందాల తార, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ గరించి చాలా మందికి తెలిసే ఉంటుంది. స్వతహాగా సినమా తార అయిన నుస్రత్, ఆ తరువాత మమతా బెనర్జీ సమక్షంలో టీఎంసీ పార్టీలో చేరి, గత సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా గెలిచింది. బెంగాలీ ముస్లిం అయిన సుస్రత్, నిఖిల్ జైన్ అనే బిజినెస్ మ్యాన్ ను ప్రేమించి, 2019లో హిందు సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుంది. నుస్రత్ వివాహం అప్పట్లో సంచలనం రేపింది.

అంతే కాదు నుస్రత్ జహాన్ పార్లమెంట్ కు నుదుటిన బొట్టు పెట్టుకుని రావడంపై ఓ వర్గం నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇదిగో ఇటువంటి సమయంలో నుస్రత్ జహాన్, తన భర్త నిఖిల్ జైన్ మధ్య మనస్పర్ధలు వచ్చాయి. దీంతో ఆమె గత యేడాది నుంచి తన భర్తకు దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో సరిగ్గా రెండు నెలల క్రితం నుస్రత్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. కోల్‌ కతాలోని భగీరథీ నియోతియా ఆస్పత్రితో సిజేరియన్ ద్వారా ఆమె బిడ్డను కంది.

nusrat jahan

ఐతే అంతకు ముందు నుస్రత్ జహాన్ ఆమె గర్భం దాల్చిన సమయంలో ఆమె భర్త నిఖిల్ జైన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నుస్రత్ గర్భం దాల్చడానికి, తనకు ఎలాంటి సంబంధం లేదని నిఖిల్ చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఇదిగో రెండు నెలల క్రితం బిడ్డ పుట్టినప్పటి నుంచి ఆ బిడ్డకు తండ్రి ఎవరు అని చాలా మంది నుస్రత్ ను అడుగుతూనే ఉన్నారు. తన బిడ్డకు తండ్రి ఎవరో ఆయనకే తెలుసని గతంలో చెప్పిన నుస్రత్ ఇప్పుడు, అసలు విషయం చెప్పింది.

తన భర్త నిఖిల్ జైన్ నుంచి విడిపోయినప్పటి నుంచి నుస్రత్ జహాన్ ఆమె ఫ్రెండ్ యష్ దాస్ గుప్తాతో సన్నిహితంగా ఉంటోంది. నుస్రత్‌కు బిడ్డ పుట్టిన విషయాన్ని కూడా యశ్ దాస్ గుప్తానే సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తాజాగా యష్ దాస్ గుప్తాతో క్యాండిల్‌ లైట్ డిన్నర్‌ లో పాల్గొన్న నుస్రత్, అతనే తన భర్త, తన బిడ్డకు తండ్రి అనే అర్థం వచ్చే విధంగా, ఓ కేక్‌పై రాసి ఉన్న ఫోటోను ఇన్‌ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇదిగో ఇప్పుడు నుస్రత్ జహాన్ బిడ్డకు తండ్రి ఆమె స్నేహితుడు యష్ దాస్ గుప్తా అని అసలు విషయం చెప్పేసిందన్నమాట.