వీడియో కాల్ చేసి నగ్నంగా కనిపించాలని కోరిన భర్త, అందుకు భార్య

గుజరాత్ క్రైం- ఈ మధ్య కాలంలో విదేశీ కొలువులు చాలా సహజం. ఉన్నత చదువులు చదివి చాలా మంది విదేశాల్లో జాబ్స్ చేస్తున్నారు. ఇక పెళ్లిళ్లు చేసుకుని భర్త భార్యని, భార్య భర్తని కూడా వీదేశాలకు తీసుకువెళ్తున్నారు. ఈ క్రమంలో గత కొంత కాలంగా ఎన్ఆర్ఐ లు తమ తమ భార్యలను అదనపు కట్నం కోసం వేధించే ఘటనలను మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు ఓ ఎన్ఐర్ఐ భర్త తన భార్యను ఓ వింత కోరిక కోరి ఆమెను ఇబ్బంది పెట్టాడు.

గుజరాత్ రాష్ట్రం అహ్మాదాబాద్‌లోని గోటాలో ఓ యువతి నివసిస్తోంది. సొంత కమ్యూనిటీకి చెందిన మ్యాట్రిమొనీ సంస్థ ద్వారా పెళ్లి సంబంధం కోసం ఓ యువకుడిని మొదటిసారి కలిసింది. ఇద్దరు ఇష్టపడటంతో, ఇరు కుటుంబాల అంగీకారంతో 2020 ఆగస్టు 21న వారిద్దరికీ పెళ్లైంది. వివాహమైన కొన్ని రోజులకే అతడు తన నిజస్వరూపం చూపించడం మొదలుపెట్టాడు. రోజూ మందు తాగి ఇంటికి ఆలస్యంగా రావడం, తాగిన మత్తులో తనను కొడుతూ హింసించడం ప్రారంభించాడు.

NRI

ఈ క్రమంలో ఓ రోజు ఎవ్వరికి చెప్పకుండా కెనడా వెళ్లిపోయాడా యువతి భర్త. అక్కడికి వెళ్లిన తరువాత కూడా ఆ దుర్మార్గుడు ఆమెను వేధించడం మానలేదు. కెనడాకు వెళ్లిన తర్వాత అసభ్యకరమైన, అనుచితమైన మెసేజ్‌లను భార్యకు పంపడం చేసేవాడు. మొబైల్ ఫోన్‌లోనే సెక్స్ చాట్ చేయాలని, కెమెరా ముందు నగ్నంగా కనపడాలని భార్యను బలవంతం చేసేవాడు. తనకు ఇలాంటివి ఇష్టం ఉండదని, అతను చెప్పిన దానికి ఒప్పుకోకపోవడంతో బూతులు తిట్టేవాడు.

ఆమెపై కోపం పెట్టుకుని, అత్తమామలకు లెనిపోనివి చెప్పి కొట్టించేవాడు. కొడుకు చేస్తున్న అసహ్యమైన పనికి, అతనికి బుద్ది చెప్పాల్సిన తల్లిదండ్రులు, కోడలిపై తమ ప్రతాపం చూపించేవారు. ఎప్పుడూ ఆమెను కొట్టి హింసించేవారు. అంతే కాదు అదనపు కట్నంగా బంగారం, నగదు తీసుకురావాలని ఒత్తిడి చేసేవారు. చాలా రోజులు భరించిన ఆమె ఇక లాభం లేదని పోలీసులను ఆశ్రయించింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.