సినిమాల్లో నటించడం ఆయనకు ఇష్టం లేదు..అందుకే మానేసా

ఫిల్మ్ డెస్క్- నిహారిక.. మోగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు. మెగా కుటుంబం నుంచి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన ఒకే ఒక్క హీరోయిన్. మొన్నటి వరకు వరసు సినిమాలు, టీవీ షోలు చేసిన నిహారకి, పెళ్లి తరువాత వాటన్నింటికి గుడ్ బై చెప్పింది. అసలు సినిమాల్లో నటిండటమే మానేసింది. దీంతో ఏమైందబ్బా అని చాలా రోజులుగా అభిమానులు ఆలోచిస్తున్నారు.

ఇదిగో ఇటువంటి సమయంలో ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న నిహారిక ఆసక్తికర విషయాలను చెప్పింది. ఒక యాక్టర్‌ గా తనకు తన పెదనాన్న చిరంజీవిగారే స్ఫూర్తి అని అంది నిహారిక. హీరోయిన్లకు పెళ్లయినా కెరీర్‌ ఏం మారడం లేదని, అందుకు సమంతను ఉదాహరణగా చూపించింది. సమంతకు పెళ్లికి ముందు ఎంత క్రేజ్‌ ఉండేదో, పెళ్లయ్యాక కూడా అంతే క్రేజ్ ఉందని చెప్పుకొచ్చింది నిహారిక.

Chaitanya

ఈ క్రమంలో అసలు విషయం చెప్పింది నిహారిక. తన భర్త చైతన్యకు తాను సినిమాల్లో నటించడం ఇష్టం లేదని, అందుకే సినిమాలు చేయడం మానేశానని చెప్పుకొచ్చింది. తనకు సినిమాల్లో నటించాలన్న కోరిక ఉన్నా, భర్త కోసం సినిమాలకు గుడ్ బై చెప్పినట్టు పేర్కొంది నిహారిక. ఐతే సినిమాలు కాకుండా ఏదైనా చేద్దామని టీచ్‌ ఫర్‌ ఇండియా అనే కార్యక్రమంలో పిల్లలకు పాఠాలు చెబుతున్నానని తెలిపింది.

ఇక సినిమాల్లో నటించకపోయినా, సినిమాలపై ఇష్టంతో ప్రొడక్షన్‌ స్టార్ట్‌ చేశానని చెప్పింది నిహారిక. ముద్దపప్పు ఆవకాయ్‌, నాన్నకూచీలతో పాటు యంగ్‌ స్టర్స్‌ తో కలిసి స్నేహంపై ఓ వెబ్‌ సిరీస్‌ తీశానని చెలిపింది. ఇటీవలే.. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ.. అనే సిరీస్‌ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది నిహారిక. ఐతే యూట్యూబర్‌ నిఖిల్‌తో కలిసి ఓ సూపర్‌ వెబ్‌ సిరీస్‌ లో మాత్రం నటిస్తున్నానని చెప్పుకొచ్చింది ఈ మెగా డాటర్.