న్యూజిలాండ్ మహిళా ప్రధానికి ఊహించని షాక్, శృంగారం గురించి జర్నలిస్ట్ ప్రశ్న

ఇంటర్నేషనల్ డెస్క్- కరోనా మహమ్మారితో ప్రపంచమంతా వణికిపోయింది. కొవిడ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లో ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలం అయ్యాయి. కోట్లాది మంది కరోనా భారిన పడగా, లక్షలాది మంది చనిపోయారు. చాలా వరకు దేశాలన్నీ ఆర్ధికరంగా నష్టపోయాయి. ఇక కరోనా ధాటికి సాధారణ జనం అల్లాడిపోయారు. ప్రపంచంలో మిగతా దేశాలతో పోలిస్తే న్యూజిలాండ్ కరోనాను చాలా సమర్ధవంతంగా ఎదుర్కొంది.

కరోనా కట్టడి చర్యలను పక్కా ప్రణాళికతో అమలు చేసి కేసుల సంఖ్యను గణనీయంగా తగ్గించి ఆ దేశ యువ ప్రధాని జసిండా ఆర్డెర్న్‌ ఔరా అనిపించారు. కరోనా కేసులు తక్కువగా నమోదైనా కూడా లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేసి, మహమ్మారిని ఈ దేశం నుంచి తరిమికొట్టారు. దీంతో జసిండా ఆర్డెర్న్‌ ముందు చూపు, కఠిన నిర్ణయాలపట్ల ప్రపంచ దేశాలన్నీ అబ్బురపడ్డాయి.

Jecinda Ardern 1

తాజాగా కరోనా మహమ్మారి విషయమై న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్‌ ఓ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆ దేశ ఆరోగ్య శాఖ డైరెక్టర్ జనరల్ ఆష్లే బ్లూమ్ ఫీల్డ్ కూడా ఆమెతో పాటు ప్రెస్ మీట్ కు హాజరయ్యారు. ఈ మీడియా సమావేశంలో ఓ టీవీ ఛానల్ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ప్రధాని జసిండా ఆర్డెర్న్‌ షాక్ తిన్నారు. ఆ తరువాత కొంత సమయానికి తేరుకున్న ఆమె జర్నలిస్డ్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు.

అక్లాండ్‌ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో కరోనా చికిత్స పొందుతున్న రోగిని చూసేందుకు వచ్చిన మహిళ, ఆ రోగితో శృంగారంలో పాల్గొందని వార్తలు వచ్చాయని, అది అత్యంత ప్రమాదకరం కదా అని సదరు జర్నలిస్డ్ ప్రధానిని అడిగారు. అనూహ్యంగా ఎదురైన ఈ ప్రశ్న విన్న తర్వాత ప్రధాని జసిండా ఒక్కసారిగా అవాక్కయ్యారు. అందుకు అనుగునంగా ఆమె మొహంలో ముఖకవలికలు స్పష్టంగా కనిపించాయి.

ఐతే అంతలోనే కొంత మేర తేరుకున్న ప్రధాని, కరోనా పరిస్థితుల్లోనే కాదు, సాధారణ పరిస్థితుల్లో కూడా హాస్పిటల్‌లో అలాంటి కార్యకలాపాలకు పాల్పడకూడదు అని సమాధానమిచ్చారు. ఐతే ప్రశ్న విన్న వెంటనే న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్‌ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ కు సంబందించిన వీడియో ఇప్పుడు సోషస్ మీడియాలో వైరల్ అవుతోంది.