వింత: బిక్షగాడి అంత్యక్రియలకు భారీగా హాజరైన ప్రజలు!

Beggar Karnataka

మాములుగా ఓ కుటుంబంలోని వ్యక్తి చనిపోతే వంద లేదా రెండు వందల మంది వస్తారు. అతడు మంచి పనులు చేసి సంఘంలో మంచి పేరును మూటగట్టుకుంటే మహా అయితే వెయ్యి మంది హాజరై అతని అంత్యక్రియల్లో పాల్గొంటారు. కానీ మన పక్క రాష్ట్రమైన కర్ణాటకలో మాత్రం ఓ వింత ఘటన చోటు చేసుకుంది. మతిస్థిమితం కోల్పోయిన బిక్షగాడు మరణించటంతో అతని అంత్యక్రియలకు ఏకంగా వేలమంది జనం హాజరై అతని దహన సంస్కారాలు పూర్తి చేశారు. వినటానికి వింతగా ఇదే నిజం.

అసలు ఓ బిక్షగాడి దహన సంస్కారాలకు ఇంత మంది జనాలు ఎందుకొచ్చారనేది కదా మీ ప్రశ్న. అయితే ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆ బిక్షగాడి పేరు హిచ్చ బసయ్య. గత 45 ఏళ్లుగా బళ్లారి జిల్లాలోని హడగళ్లీ ప్రాంతంలో బిక్షమెత్తుకుంటూ జీవిస్తూ ఉండేవాడు. అలా చాలా ఏళ్లు ఇక్కడే ఉంటూ దొరికిన ఆహారాన్ని తిని స్థానికంగా షాపు కిందో ఎక్కడో నిద్రపోయేవాడు. ఇ

క్కడ మనం హిచ్చ బసయ్య గురుంచి చెప్పుకోవాల్సిన మరో విషయం ఏంటంటే..? ఈ బిక్షగాడు ప్రతీ ఒక్కరి వద్ద అడుక్కునే క్రమంలో రూ.1 మించి ఎక్కువ తీసుకోడు. ఒకవేళ ఎక్కువ ఇచ్చినా రూ.1 మాత్రమే తీసుకుని మిగతావి తిరిగి వెనక్కి ఇచ్చేస్తాడు. ఇక ప్రతి ఒక్కరిని అప్పాజీ అని ప్రేమతో పిలుస్తాడు. ఈ బిక్షగాడికి స్థానిక ప్రజలకు మధ్య మరో సెంటిమెంట్ కూడా ఉందండోయ్. స్థానిక ప్రజలు ఏదైన మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పుడు బిక్షగాడు హిచ్చ బసయ్యకు రూ.1 ఇచ్చి పని మొదలు పెట్టడం అక్కడి ప్రజలకు ఆనవాయితిగా మారింది.

ఇలా చేస్తే మంచి జరుతుందని వీరి నమ్మకం. దీంతో ఇదే అలవాటును అక్కడి ప్రజలు కంటిన్యూ చేస్తూ ఉండేవారు. అయితే ఇటీవల బిక్షగాడు హిచ్చ బసయ్యను గుర్తు తెలియని వాహనం ఢీకోనడంతో మరణించాడు. ఇక విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలంతా అతని దహన సంస్కారాలను ఘనంగా జరిపారు. దీంతో బిక్షగాడు హిచ్చ బసయ్య అంత్యక్రియలకు స్థానికంగా ఉండే జనాలు వేల మంది హాజరై ఈ బిక్షగాడికి తుది వీడ్కోలు పలికారు. కుటుంబంలోని ఓ వ్యక్తి చనిపోతే పట్టించుకోని నేటి సమాజంలో ఓ బిక్షగాడు చనిపోతే కర్ణాటకలోని జనం చూపించిన ప్రేమపై మీ అభిప్రాయలను కామెంట్ రూపంలో తెలియజేయండి.