పాకిస్తాన్ గెలుపు మద్దతుగా స్టేటస్ పెట్టుకున్న స్కూల్ టీచర్

Ind vs Pakistan Match Day - Suman TV

టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఇండియా-పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో టీమిండియాపై పాకిస్తాన్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. చాలా ఏళ్ల కాలం తర్వాత దాయాది దేశంపై జరిగిన ఈ పోరుని యావత్ ఇండియానే కాకుండా ప్రపంచ దేశాలన్నీ ఎంతో ఆసక్తిగా చూశాయి. దీంతో టీమిండియా ఓటమి పాలవటంతో క్రికెట్ అభిమానులంతా కాస్త నిరాశకు గురయ్యారు. ఇలాంటి ఓటమిని జీర్ణించుకోలేక పోతున్న తరుణంలో ఇండియాలోని వ్యక్తులు ఎవరైన శత్రు దేశం విజయం గురించి పోగిడితే ఎలా ఉంటుంది.

Ind vs Pakistan Match Day - Suman TVనిజానికి ఇలానే రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో జరిగింది. ఓ స్కూల్ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న నఫీసా అట్టారీ అనే టీచర్ పాకిస్తాన్ గెలిచిన తర్వాత మనం గెలిచాం అంటూ స్టేటస్ పెట్టుకుంది. ఆమె పెట్టుకున్న ఈ స్టేటస్ ను కొంతమంది విద్యార్థులతో పాటు స్కూల్ యాజమాన్యం కూడా చూసింది. దీంతో ఆ స్కూల్ స్టూడెంట్.. టీచర్ మీరు పాకిస్తాన్ కు మద్దతు పలుకుతున్నారా అని ప్రశ్నిస్తే అవుననే సమాధానం ఇచ్చింది. ఈ విషయం కాస్త స్కూల్ మేనేజ్ మెంట్ కు తెలియటంతో వెంటనే ఆమెను సస్పెండ్ చేస్తు నిర్ణయం తీసుకున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.