టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఇండియా-పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో టీమిండియాపై పాకిస్తాన్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. చాలా ఏళ్ల కాలం తర్వాత దాయాది దేశంపై జరిగిన ఈ పోరుని యావత్ ఇండియానే కాకుండా ప్రపంచ దేశాలన్నీ ఎంతో ఆసక్తిగా చూశాయి. దీంతో టీమిండియా ఓటమి పాలవటంతో క్రికెట్ అభిమానులంతా కాస్త నిరాశకు గురయ్యారు. ఇలాంటి ఓటమిని జీర్ణించుకోలేక పోతున్న తరుణంలో ఇండియాలోని వ్యక్తులు ఎవరైన శత్రు దేశం విజయం గురించి […]