మన చుట్టు ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉంటాయో చెప్పడం కష్టం. ఇలాంటి పరిస్థితి సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ప్రమాదాలు అనేవి చెప్పిరావు. అయితే కొంతమంది ప్రమాదాలు ముందే పసిగట్టి తృటిలో తప్పించుకుంటుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే కర్ణాటకలో చోటు చేసుకుంది. కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మైకు పెద్ద ప్రమాదమే తప్పింది. వివరాల్లోకి వెళితే..
ఇటీవల సీఎం బసవరాజ్ బొమ్మ తాలికోట్ లో పర్యటించారు. ఈ సందర్భంగా బంటనూర్ గ్రామానికి చెందిన ఒక అభిమాని సీఎం కి ఎద్దును విరాళంగా ఇచ్చారు. తర్వాత సీఎం బసవరాజ్ బొమ్మై అక్కడ ఎద్దులకు పూజలు చేస్తూ వచ్చారు. అదే సమయంలో ఒక ఎద్దుపై చేయి వేసి నిమిరాడు.. అంతే ఒక్కసారే అది ముందుకు వచ్చి దాడి చేసేందుకు ప్రయత్నించింది. దీంతో అక్కడ ఉన్నవారంతా షాక్ తిన్నారు. అంతలోనే ఆ ఎద్దు యజమాని వచ్చి దాన్ని కంట్రోల్ చేశాడు. ఎవరికీ ఏ ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.