బిగ్ బ్రేకింగ్ ! దేశంలో వ్యాక్సిన్ వికటించి తొలి మ‌ర‌ణం!

covid death

కరోనా వైరస్ విజృంభణ అన్నీ దేశాల్లో కొనసాగుతూ వస్తోంది. మానవాళి మొత్తం ఈ మహహ్మరి దెబ్బకి కకావికలం అయిపోతుంది. దీంతో.., చైనా వైరస్ ని ఎదుర్కోవడానికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జపాన్ వంటి దేశాలు వ్యాక్సినేషన్ ప్రాసెస్ ని వేగవంతం చేశాయి. మరోవైపు ఇండియా కూడా వ్యాక్సినేషన్ విషయంలో ప్రపంచ దేశాలతో పోటీ పడుతోంది. ఈ నెల చివరి నాటికి మొత్తం 30 కోట్ల మందికి వ్యాక్సిన్ పూర్తి చేయడమే లక్ష్యంగా ఇండియా ముందుకు వెళ్తోంది. ఇక ప్రధాని మోదీ దేశ ప్రజలకి వ్యాక్సిన్ ఫ్రీ అని ప్రకటించడంతో రానున్న కాలంలో ఈ సంఖ్య గణనీయంగా పెరగనుంది. ఇలాంటి సమయంలో దేశంలో వ్యాక్సిన్ వికటించి తొలి మరణం సంభవించడం అందరిని షాక్ కి గురి చేస్తోంది.

First Death After Covid Vaccinationవ్యాక్సిన్ వికటించి జరిగిన తొలి తొలి మరణాన్ని అధికారికంగా కేంద్రం ధృవీక‌రించింది. మార్చి 8న తొలిడోసు తీసుకున్న 68 ఏళ్ల వృద్ధుడు… డోసు తీసుకోవ‌డం వ‌ల‌న వ‌చ్చిన రియాక్ష‌న్‌తో చ‌నిపోయిన‌ట్లు వైద్యులు ప్ర‌క‌టించారు. అయితే ఆ వృద్ధుడు ఏ టీకా వేసుకున్నాడో వివరాలు తెలియరాలేదు. ఇక ఇప్పుడు ఇండియాలో కొత్తగా 60,471 కరోనా కేసులు, 2726 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా 2,95,70,881 కరోనా కేసులు,3,77,031 మరణాలు నమోదు కాగా… ప్రస్తుతం దేశంలో ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 9,13,378కు చేరింది. ఏదేమైనా వ్యాక్సిన్ విషయంలో ప్రజలు ఇప్పుడిప్పుడే అన్నీ అపోహల నుండి బయటపడి వ్యాక్సిన్ డ్రైవ్స్ కి స్పందిస్తున్నారు. ఇలాంటి సమయంలో వ్యాక్సిన్ వికటించి తొలి మ‌ర‌ణం సంభవించడం విచారించతగ్గ విషయం.