దేశవ్యాప్తంగా బొగ్గు పరిశ్రమల కార్మికులకు శుభవార్త చెప్పారు కోల్ ఇండియా, సింగరేణి యాజమాన్యాలు. ఈ ఏడాది సింగరేణి కార్మికులకు రూ.72, 500 బోనస్ చెల్లించనున్నారు. ఈమేరకు సింగరేణి ప్రకటించింది. గతేడాది కార్మికులకు రూ.68,500 బోనస్ ను సింగరేణి చెల్లించింది. ఈసారి బోనస్ మొత్తాన్ని పెంచింది. ఢిల్లీలో జాతీయ కార్మిక సంఘాలతో కోల్ ఇండియా, సింగరేణి యాజమాన్యాలు భేటీ అయి బోనస్ పై నిర్ణయం తీసుకున్నాయి.
దేశవ్యాప్తంగా బొగ్గు పరిశ్రమల కార్మికులకు లాభాల ఆధారిత బోనస్ (పీఎల్ ఆర్) రూ.72, 500 చెల్లించాలని అంగీకరించాయి. ఈ నిర్ణయంతో సింగరేణిలో ఉన్న 43 వేల మంది కార్మికులకు లబ్ధి కలగనుంది. అయితే ఈ బోనస్ పండుగకు ముందే అందించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.