ఈ ధనవంతులని, పేదలను ఒకే రైలులో పెట్టారు చూడండి.. ఈ సిస్టం అని అనాలి అని అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఏసీ బోగీలు ఎక్కువైపోయి.. జనరల్ బోగీలు తగ్గిపోయాయని విమర్శలు వస్తున్నాయి కదా. ఏసీ ప్రయాణికులకు ఏసీ రైళ్లు, సాధారణ ప్రయాణికులకు జనరల్ బోగీలతో కూడిన రైళ్లు నడిపితే ఏ సమస్య ఉండదు కదా అని మీకు అనిపించిందా? రైల్వే శాఖ అయితే ఈ సమస్య మీద దృష్టి పెట్టింది.
తమ పనిలో భాగంగా రోడ్డు పక్కన మొక్కలు కత్తిరిస్తున్నారు కూలీలు. వారికేం తెలుసు మృత్యువు తమ వైపు ముంచుకొస్తోందని. ఆ మహిళల మీదకు దూసుకొచ్చిందో లారీ. ఈ ప్రమాదం ఎక్కడ జరిగిందంటే..!
అతడు ఓ నటి ఇంట్లో పనివాడు. వేరే రాష్ట్రం నుంచి వలస వచ్చి మరీ ఆమె దగ్గర కొన్నేళ్ల నుంచి నమ్మకంగా పనిచేస్తున్నాడు. అలాంటి అతడికి లాటరీలో సూపర్ జాక్ పాట్ తగిలింది. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోయాడు.
మతం అనేది దేవుడ్ని చేరుకునే మార్గం మాత్రమే. భౌతిక రూపంగా మనుషులు వేరైనా ఆత్మలుగా అందరం ఒకటే. మతసామరస్యం అనే మాట మనిషిని ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. మన మతం కాదు, మన దేవుడు కాదు, మన మనుషులు కాదు, మనది కాదు అనుకుని బతికే సొసైటీ ఆఫ్ ఇండియాలో అంతా మనవాళ్లే అని బతికే మనుషులు కూడా ఉంటారు. అందరి దైవం ఒకటే, మన మతాన్ని ప్రేమిద్దాం, పర మతాన్ని గౌరవిద్దాం అని ఆదర్శంగా జీవిస్తుంటారు. […]
వారిది మన దేశం కాదు.. పని కోసం వచ్చారు.. సొంత బంధువులే సాయం చెయ్యని ఈ సమాజంలో వారిని అయ్యో పాపం అని ఓ కుటుంబం చేరదీసింది. పని కల్పించింది. వారు కొన్ని నెలలు నమ్మకంగానే పని చేశారు. తర్వాత తెలిసింది వారి అసలు రంగు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది.. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ లోని కుకట్ పల్లిలో దామోదర్ రావు కుటుంబం నివాసం ఉంటున్నారు. 8 నెలల క్రితం వారి వద్దకు ఓ నేపాలి […]
దేశవ్యాప్తంగా బొగ్గు పరిశ్రమల కార్మికులకు శుభవార్త చెప్పారు కోల్ ఇండియా, సింగరేణి యాజమాన్యాలు. ఈ ఏడాది సింగరేణి కార్మికులకు రూ.72, 500 బోనస్ చెల్లించనున్నారు. ఈమేరకు సింగరేణి ప్రకటించింది. గతేడాది కార్మికులకు రూ.68,500 బోనస్ ను సింగరేణి చెల్లించింది. ఈసారి బోనస్ మొత్తాన్ని పెంచింది. ఢిల్లీలో జాతీయ కార్మిక సంఘాలతో కోల్ ఇండియా, సింగరేణి యాజమాన్యాలు భేటీ అయి బోనస్ పై నిర్ణయం తీసుకున్నాయి. దేశవ్యాప్తంగా బొగ్గు పరిశ్రమల కార్మికులకు లాభాల ఆధారిత బోనస్ (పీఎల్ ఆర్) […]
నగరంలోని ఎల్పీనగర్ పరిధి సాహెబ్‌నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. డ్రైనేజీ క్లీనింగ్ కోసం మ్యాన్ హోల్‍లోకి దిగిన ఇద్దరు జీహెచ్ఎంసీ కార్మికులు గల్లంతయ్యారు. గల్లంతైన కార్మికులు అంతయ్య, శివగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు, మున్సిపల్, అగ్నిమాపక సిబ్బంది సహాయ చర్యలు చేపట్టాయి. మ్యాన్‌హోల్‌లో ఊపిరాడక మృతి చెందిన ఒక కార్మికుడిని బయటకి తీశారు. మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. అతను కూడా మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. ఈ ఘటనపై ఎల్బీ నగర్ ఎమ్మెల్యే […]