బిగ్ బ్రేకింగ్: సీఎం కాన్వాయ్‌పై కోడిగుడ్ల దాడి!

egg attack on cm

ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా ప్రజలకి న్యాయం చేయడానికి, వారిని కష్ట కాలంలో ఆదుకోవడానికి, వారి జీవన విధానాన్ని మెరుగు పరచడానికే పని చేయాలి. కానీ.., ఈ ప్రాసెస్ అన్నీ వర్గాల ప్రజలను తృప్తి పరచాలి అంటే అది సాధ్యం అయ్యే పని మాత్రం కాదు. మెజారిటీ ప్రజల మనసు గెల్చుకోవడమే ప్రభుత్వాల పని తీరుకి నిదర్శనం. అయితే.., ప్రభత్వంపై వ్యతిరేకత ఉంటే.. దాన్ని ఓటు రూపంలోని, ఓ నిరసన రూపంలోనో తెలియజేయాలి గాని.., దాడులకు తెగబడటం అనేది ఆమోదించతగ్గ విషయం కాదు. తాజాగా ఇలాంటి ఘటన ఒడిశా లో జరిగింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కాన్వాయ్ పైనే కోడిగుడ్లతో దాడి చేశారు. ఆ వివరాల్లోకి వెళ్తే..

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ కాన్వాయ్‌పై భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేశారు. పూరీ నగరంలోని దర్జీపోఖారీ ఛక్‌ వద్ద బుధవారం ఈ దాడి జరిగింది.ఓ ప్రాజెక్టు శంకుస్థాపనకు సీఎం పట్నాయక్‌ హాజరయ్యారు. ఆ కార్యక్రమాన్ని ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ దాడి జరిగింది.

egg attack on cmయువ మోర్చా కార్యకర్తలు సీఎం కాన్యాయ్‌పైకి అతి దగ్గర నుండే కోడిగుడ్లు విసరడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇవి నేరుగా ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న కారు అద్దాలకు తగలగా.., ఈ దాడి చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హోంశాఖ సహాయ మంత్రి దిబ్య శంకర్‌ మిశ్రాను కేబినెట్‌ నుంచి తొలగించాలని ఈ నిరసనలు జరుగుతున్నాయి. మరి.. సీఎం కాన్వాయిపై ఇలాంటి దాడి జరగడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.