ప్రముఖ సామాజిక సేవా కార్యకర్త అన్నా హజారే అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో నొప్పి రావడంతో గురవారం ఆయనను పుణెలోని రూబీ ఆస్పత్రిలో చేర్పించారు. అన్నా హజారే వయసు 84 సంవత్సరాలు. ఆయన గత కొన్నిరోజులుగా ఛాతీలో నొప్పితో బాధపడుతున్నారు. తీవ్ర ఛాతీలో నొప్పితో బాధపడుతున్న ఆయనను పూణేలోని రుబే హాల్ క్లినిక్ ఆసుపత్రిలో చేర్చారు. వైద్య పరీక్షల్లో ఆయన రక్తనాళాల్లో అడ్డంకి ఉన్నట్టు గుర్తించారు. అనంతరం యాంజియోప్లాస్టీ ద్వారా అడ్డంకిని తొలగించారు.
ప్రస్తతం ఆయన ఆరోగ్యం మెరుగ్గానే ఉందని, భయపడాల్సిన పనిలేదని డాక్టర్లు చెప్పారు. అయినప్పటికీ వైద్యుల పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందజేస్తున్నామని, అదేవిధంగా కొద్దిపాటి విశ్రాంతి కూడా అవసరం అని రూబీ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అవధూత్ వెల్లడించారు.
కాగా, అన్నా హజారే ఆరోగ్య పరిస్థితిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాల్సిందిగా కోరారు. ప్రస్తుతం అన్నా హజారే ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే డిశ్చార్జి అవుతారని రుబే హాల్ క్లినిక్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు.