చిన్న, పెద్ద అనే తేడా లేకుండా హార్ట్ స్ట్రోక్‌తో చనిపోతున్నారు. నటుడు తారకరత్న, మొన్న పదోతరగతి చదువుతున్న అమ్మాయి, ఇటీవల ఓ పెళ్లిలో నడి వయస్కుడు, జిమ్‌కు వెళ్లిన కానిస్టేబుల్ గుండె పోటుతో మృతి చెందారు. తాజాగా మరో నేత కన్నుమూశారు.
ఈ మద్య సినీ, రాజకీయ రంగాల్లో పలు విషాద సంఘటనలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. తమకు ఎంతో ఇష్టమైన నటులు, నేతలు అస్వస్థతకు లోనై ఆస్పత్రిపాలు కావడంతో కుటుంబ సభ్యులే కాదు అభిమానులు, కార్యకర్తలు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు.
ప్రముఖ సామాజిక సేవా కార్యకర్త అన్నా హజారే అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో నొప్పి రావడంతో గురవారం ఆయనను పుణెలోని రూబీ ఆస్పత్రిలో చేర్పించారు. అన్నా హజారే వయసు 84 సంవత్సరాలు. ఆయన గత కొన్నిరోజులుగా ఛాతీలో నొప్పితో బాధపడుతున్నారు. తీవ్ర ఛాతీలో నొప్పితో బాధపడుతున్న ఆయనను పూణేలోని రుబే హాల్ క్లినిక్ ఆసుపత్రిలో చేర్చారు. వైద్య పరీక్షల్లో ఆయన రక్తనాళాల్లో అడ్డంకి ఉన్నట్టు గుర్తించారు. అనంతరం యాంజియోప్లాస్టీ ద్వారా అడ్డంకిని తొలగించారు. ప్రస్తతం ఆయన ఆరోగ్యం మెరుగ్గానే […]