చిన్న, పెద్ద అనే తేడా లేకుండా హార్ట్ స్ట్రోక్‌తో చనిపోతున్నారు. నటుడు తారకరత్న, మొన్న పదోతరగతి చదువుతున్న అమ్మాయి, ఇటీవల ఓ పెళ్లిలో నడి వయస్కుడు, జిమ్‌కు వెళ్లిన కానిస్టేబుల్ గుండె పోటుతో మృతి చెందారు. తాజాగా మరో నేత కన్నుమూశారు.
రోజు రోజుకూ గుండె బలహీనపడుతోంది. చిట్టి గుండెకు ఏం కష్టమోస్తుందో ఏమో కానీ విలవిలలాడుతోంది. ఇటీవల కాలంలో గుండె పోటుతో ఎక్కవగా మరణాలు చోటుచేసుకుంటున్నాయి. నటుడు తారకరత్న, మొన్న పదోతరగతి చదువుతున్న అమ్మాయి, ఇటీవల ఓ పెళ్లిలో నడి వయస్కుడు, జిమ్‌కు వెళ్లిన కానిస్టేబుల్ కుప్పకూలిపోయిందీ హార్ట్ ఎటాక్ తోనే. నిన్నటి నిన్న సినిమా చూస్తూ ఓ సాఫ్ట్ వేర్, బస్టాఫ్‍లో మరొకరు గుండె పోటుతోనే మృత్యువాత పడ్డారు. పొద్దున్న లేస్తూనే ఇటువంటి న్యూస్‌లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా హార్ట్ స్ట్రోక్‌తో చనిపోతున్నారు. తాజాగా మరొకరు గుండె పోటుతో మరణించారు.
కర్ణాటకప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కెపిసిసి) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి ఆర్ ధ్రువనారాయణ గుండె పోటుతో కన్నుమూశారు. శనివారం ఉదయం 6.40 నిమిషాలకు ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో మైసూరులోని ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. అయితే అప్పటికే ధ్రువనారాయణ ప్రాణాలు విడిచినట్లు డీఆర్ఎంఎస్ హాస్పిటల్ డాక్టర్ మంజునాథ్ తెలిపారు. ‘ఛాతిలో నొప్పి రాగానే ఆయన డ్రైవర్‌కు ఫోన్ చేశాడు. కారులో తరలిస్తున్న సమయంలోనే ధ్రువనారాయణ గుండె పోటుతో చనిపోయారు’అని పేర్కొన్నారు . కర్నాటకలోని చామరాజనగర్ నియోజకవర్గం నుంచి పార్లమెంట్‌కు ఆయన రెండు సార్లు ప్రాతినిధ్యం వహించారు. ఆయన మృతికి కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, రణదీప్ సూర్జేవాలా, మల్లిఖార్జున్ ఖర్గే సంతాపం తెలిపారు. పలువురు విపక్ష నేతలు కూడా సంతాపం వ్యక్తం చేశారు.
‘ ధ్రువ నారాయణ ఆకస్మిక మరణం ఎంతో కలచివేసింది. కష్టపడి పనిచేసి, కింద స్థాయి నుండి ఎదిగిన నేత, విద్యార్థి నేతగా, యూత్ కాంగ్రెస్‌లో పనిచేశారు. ఆయన మరణం కాంగ్రెస్ కు తీరని లోటు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. కాగా, ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి బొసవరాజు బొమ్మై స్పందించారు. ఆయన మృదు స్వభావి అని, పార్లమెంట్‌లో కర్ణాటక తరుఫున మాట్లాడేవారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. బెంగుళూరులోని అగ్రికల్చర్ వర్సిటీ నుంచి ఆయన మాస్టర్స్ డిగ్రీ పొందారు. 1983లో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Saddened by the sudden demise of former MP, Shri R Dhruvanarayan.
A hard-working & humble grassroots leader, he was a champion of social justice who rose through the ranks of NSUI & Youth Congress.
His passing is a huge loss to the Congress party. My condolences to his family. pic.twitter.com/SbBr8I7ZTK
— Rahul Gandhi (@RahulGandhi) March 11, 2023