ఉపాధ్యాయుడి దాష్టీకం.. విద్యార్థిని కాలితో తంతూ.. వీడియో వైరల్‌

Class 12 student brutally thrashed by teacher

గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వరహ… అంటూ మనం గురువులను పూజిస్తాం. గురవే మనకు దైవంతో సమానం. విద్యాబుద్దులు నేర్పే గురువులంటే మనకు అంత గౌరవం. కానీ, కొందరు ఉంటారు చూడండి.. వృత్తిని కించ పరచడానికే వస్తారేమో అనిపిస్తుంది. క్లాస్‌కి రాకపోతే ప్రిన్సిపాల్‌కి కంప్లయింట్‌ చేయాలి. లేదా తల్లిదండ్రులకు విషయం చెప్పాలి. అంతేగానీ ఇలా కొడతారా? విచక్షణారహితంగా కాలితో తంతూ ఆ ఉపాధ్యాయుడు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. తమిళనాడు చిదంబరంలో ఓ ఉపాధ్యాయుడి దాష్టీకం నెట్టింట వైరల్‌గా మారింది. 12వ తరగతి చదువుతున్న ఏడుగురు విద్యార్థులు క్లాసుకు రావట్లేదని ఆగ్రహంతో ఊగిపోయాడు. విద్యార్థులను మోకాళ్లలపై కూర్చోబెట్టి కర్రతో వాతలు తేలేలా కొట్టాడు. అక్కడితో ఆగకుండా జుట్టు పట్టుకుని కాలితో తంతూ చిత్రహింసలు చేశాడు. తరగతిలో ఉన్న మరో విద్యార్థి ఫోన్‌లో వీడియో తీయడంతో ఈ విషయం వెలుగు చూసింది. మరి, ఆవీడియో మీరు చూడండి.