కరోనా బారిన పడిన నారా లోకేశ్

Nara Lokesh got Covid

కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది. సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు వరుసగా వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. తనకు ఎటువంటి సింటమ్స్ లేవని, ఆరోగ్యం బాగానే ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నట్లు తెలిపిన ఆయన, ఈ మధ్యకాలంలో తనను కలిసినవాళ్లు టెస్టులు చేసుకోవాలని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.