మై విలేజ్ షో అనిల్ జీల వివాహం.. పెళ్లి కార్డుపై గూగుల్ పే స్కాన్ కోడ్

డిజిటల్ మీడియా డెస్క్- మై విలేజ్ షో.. యూట్యూబ్ లో ఈ షో ఎంత పాపులర్ అయ్యిందో చెప్పక్కర్లేదు. వినూత్న ఆలోచనలతో, వెరైటీ కార్యక్రమాలతో మైవిలేజ్ షో అందరి మన్ననలు పొందింది. ఈ షో ద్వార యూట్యూబర్ అనిల్ జీల తో పాటు గంగవ్వ చాలా మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక మై విలేజ్ షో రూపకర్తల్లో ఒకరైన అనిల్ జీల ఈనెల 1న పెళ్లి చేసుకున్నాడు. కరోనా నేపధ్యంలో చాలా కొద్ది మంది బంధువులు, సన్నిహితుల మధ్య అతని పెళ్లి జరిగింది. ఐతే అతని వివాహ ఆహ్వాన పత్రిక ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఎందుకంటే కరోనా మరియు తెలుగు మాండలికాన్ని కలిపి వెరైటీగా రూపొందించిన అనిల్ జీల వెడ్డింగ్ కార్డ్ అందరిని ఆకట్టుకుంది. అనిల్ సిద్దిపేట జిల్లాలోని నంగున్నూర్ జోన్ లోని దర్గపల్లి గ్రామానికి చెందినవాడు. పెళ్లికి ముందు వినూత్నంగా అందరిని పెళ్లికి ఆహ్వానించాడు అనిల్. తన పెళ్లి మే 1 న జరిగనుందని, అందరూ ఇన్ స్టా గ్రామ్ లో పెళ్లి చూడాలని కోరుకుంటున్నానని చెప్పాడు. కరోనా లగ్గా మ్యాగజైన్.. అనే వినూత్న గ్రీటింగ్ కార్డు తయారు చేశామని అన్నాడు.

కరోనా కాలంలో అతిథులు లేకుండా తాను పెళ్లి చేసుకుంటున్నాని అనిల్ చెప్పుకొచ్చాడు. ఇన్‌స్టా లైవ్‌లో వివాహ వేడుకను చూడాలని ఆహ్వానించాడు. ప్రతి ఒక్కరూ తనను ఆన్‌లైన్‌లో ఆశీర్వదించాలని కోరాడు అనిల్. పెళ్లి తర్వాత ఇళ్లలో భోజనం చేయాలనుకునేవారికి ప్రత్యేకంగా గూగుల్ పే క్యూ ఆర్ కోడ్ స్కాన్ ను పత్రికలో ప్రింట్ చేశారు. పెళ్లికి వచ్చిన కట్నా, కరోనా కాలంలో పోషకాహార లోపంతో బాధపడుతున్న వారికి ఆర్థిక సహాయంగా బహుమతులు ఇస్తామని చెప్పారు. అతే కాదు పెళ్లి పత్రికలో వధువు, వరుడి పేర్ల పక్కన కరోనా నెగిటివ్ అని రాయడం అందరిని ఆకట్టుకుంది. ఇలా వెరైటీగా ఉన్న అనిల్ జీల వివాహ పత్రికను తెలంగాణ మాండలికం పదాలతో కవర్ చేసినందుకు అంతా ప్రశంసిస్తున్నారు. అనిల్ జీల పెళ్లి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.