మై విలేజ్ షో అనే యూట్యూబ్ చానల్ ద్వారా ఎంతో ఫేమస్ అయ్యారు గంగవ్వ. తెలంగాణ మాండలికంలో అద్భుతంగా మాట్లాడుతూ, మంచి వాక్చాతుర్యంతో అనేక మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. యితే ఇటీవల ఆమె ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి విదితమే. టీడీపీ అధినేత నారా చంద్రబాబునుద్దేశించి ఓ టివీ కార్యక్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
మై విలేజ్ షో అనే యూట్యూబ్ చానల్ ద్వారా ఎంతో ఫేమస్ అయ్యారు గంగవ్వ. తెలంగాణ మాండలికంలో అద్భుతంగా మాట్లాడుతూ, మంచి వాక్చాతుర్యంతో అనేక మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. బీడీ కార్మికురాలైన ఆమె.. అనతికాలంలోనే పేరు సంపాదించారు. తనకు సంబంధించి ప్రతి విషయాన్ని ఆమె తన యూట్యూబ్ చానల్ ద్వారా పంచుకుంటారు. ఆ తర్వాత ప్రముఖ చానల్‌లో ప్రసారమయ్యే రియాలిటీ షో బిగ్ బాస్ 4 సీజన్‌లో హౌస్‌లోకి వెళ్లి.. కొన్ని వారాలు అలరించి.. ఆ తర్వాత అక్కడ ఇమడలేక అర్థాంతరంగా బయటకు వచ్చేశారు. అనంతరం ఆమెకు వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. మల్లేశం, ఇస్ట్మార్ట్ శంకర్, ఎస్ ఆర్ కళ్యాణ మండపం, రాజ రాజ చోర, లవ్ స్టోరీ వంటి సినిమాల్లో కనిపించారు. అయితే ఇటీవల ఆమె ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి విదితమే. టీడీపీ అధినేత నారా చంద్రబాబునుద్దేశించి ఓ టివీ కార్యక్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
ఇటీవల వనిత టీవీ ఛానల్‌లో ఉగాది స్పెషల్ ఈవెంట్‌లో భాగంగా.. గంగవ్వకి స్క్రిప్ట్‌లో భాగంగా.. కొంతమంది ప్రముఖల జాతకాలను చెప్పాలని వాళ్ల ఫొటోలను ఒక్కొక్కటిగా చూపించింది యాంకర్. అయితే చంద్రబాబు ఫొటో చూపించినప్పుడు గంగవ్వ.. చంద్రబాబుకి గ్రహణం పట్టిందని జాతకం చెప్పింది. ఈ వ్యాఖ్యలతో ఆమెపై తీవ్రంగా విరుచుకుపడ్డాయి టీడీపీ శ్రేణులు. ఆ వీడియో బయటకు వచ్చిన అనంతరం ఆమె క్షమాపణలు చెబుతూ వీడియో కూడా చేసింది. ‘ మీ అందరికీ నమస్కారం. నాకు టీవీ వాళ్లు చెప్పబట్టే కానీ నాకు అనాలని అనరాదు. నాకు చదువులేదు సారూ..నా కష్టం, సుఖం అందరితో అందరికీ చెప్పినా.. అందరికీ తెలుసు. ఆ సారుని (చంద్రబాబు) ఆ టీవీ ఛానల్ వాళ్లే అనిపించారు. నన్ను తప్పు పట్టుకోకండి.క్షమించండి. నాకు ఎలా మాటాడాలో తెలవదు. అనమంటే అన్నాను. మీరంతా సపోర్టు చేయబట్టే ఓ గూడు కట్టుకోగలిగాను మీ అందరూ తప్పుగా అనుకోవద్దు . నేను మాట జారితే.. క్షమించడయ్యా’ అంటూ కన్నీళ్లతో చేతులెత్తి చంద్రబాబు నాయుడుకి, టీడీపీ శ్రేణులకు క్షమాపణ చెప్పింది గంగవ్వ.
చంద్రబాబునుద్దేశించి ఆమె చేసిన క్లిప్ వైరల్‌గా మారడంతో ఆమెకు ఫోన్లు చేస్తూ బెదిరిస్తున్నట్లు కొన్ని ఆడియో రికార్డులు బయటకు వచ్చాయి. ఓ కాల్‌లో మై విలేజ్ షో అనిల్‌తో ఓ టీడీపీ శ్రేణులు, నేతలు, కార్యకర్తలు ఫోనులో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఛానల్ వాళ్లే మాట్లాడించారా.. ఆమె మాట్లాడారా.. అని అడగ్గా.. ‘గంగవ్వకు ఏమీ తెలియదని, వనిత ఛానల్స్ అనమన్నారని, ఆ సమయంలో పలువురు నేతల ఫోటోలను చూపించగా.. చంద్రబాబుకు ఏడేళ్ల గ్రహణం పట్టిందీ.. ఈ సారి ప్రయత్నం చేస్తే గ్రహణం వీడే పరిస్థితి ఉందని అన్నారు. కానీ అందులో ఓ ముక్కను మాత్రమే కట్ చేసి వైరల్ చేశారని, ఇది ఇష్యూగా మారడంతో టీవీ ఛానల్ వాళ్లకు ఫోన్ చేసి తీసేయాలని కోరాం’అని సమాధానమిచ్చారు అనిల్. అయితే చంద్రబాబుని అలా అనడం సరికాదని, ఆమెతో క్షమాపణలు చెప్పిస్తూ వీడియో చేయించాలని కోరారు. అందుకు అంగీకరించాడు అనిల్. ఆ తర్వాత వచ్చిన వీడియోనే అదిగా తెలుస్తోంది.