సోషల్ మీడియా ఓ గొప్ప వేదిక. ఈ వేదికను మనం ఎలా ఉపయోగించుకుంటే అలా ఉపయోగపడుతుంది. సోషల్ మీడియాను ఉపయోగించుకుని ఎంతో మంది తమ టాలెంట్ ను ప్రపంచానికి చూపించారు. అలా దీని ద్వారా చాలామంది సెలెబ్రిటీలుగా కూడా మారారు. అనంతరం సినిమాలో సైతం అవకాశాలు దక్కించుకుని దూసుకెళ్తున్నారు. అలా సామాన్య స్థితి నుంచి స్టార్ సెలబ్రిటీ స్థాయికి ఎదిగిన వారు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో ‘మై విలేజ్ షో’ ఫేమ్ గంగవ్వ ఒకరు. ఓ చిన్న పల్లెటూరిలో కూలి పనులు చేసుకుంటూ ఉండడానికి కూడా సరైన ఇల్లు లేనటువంటి పరిస్థితి నుంచి నేడు ఒక స్టార్ సెలబ్రిటీ స్థాయికి గంగవ్వ ఎదిగారు. సోషల్ మీడియా ద్వారా గంగవ్వకు ఓ రేంజ్ లో పేరు వచ్చింది. మరి.. ఆమె సంపాదన విషయంపై కొన్ని వార్తలు వినిపిస్తోన్నాయి. గంగవ్వకు యూట్యూబ్ ద్వారా నెలకు భారీగానే సంపాదన వస్తున్నట్లు తెలుస్తోంది.
గంగవ్వ.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకలు ఉండరు. తనదైన యాసతో గంగవ్వ అందరిని ఆకట్టుకుంది. తమ బంధువుల సహాయంతో తనకు సంబంధించిన విషయాలను, పల్లెటూరి జీవనం గురించి అన్ని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోలు చేస్తుంది. అలా మై వీలేజ్ షో వీడియోలతో గంగవ్వ ఎంతో ఫేమస్ అయ్యారు. గంగవ్వను చూస్తే.. మన పక్కంట్లో ఉండే లేదా మన ఇంట్లో ఉండే అవ్వలాగానే అనిపిస్తోన్నారు. పల్లెటూరు వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించడంతో ఈమెకు అతి తక్కువ సమయంలోనే ఎక్కువమంది ఫాలోవర్లను సంపాందించారు. సోషల్ మీడియాలో వచ్చిన ఫేమ్ తో గంగవ్వకు బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశం కూడా వెళ్లింది. అప్పటి వరకు పల్లెటూరు వీడియోలతో ఎంటర్టైన్ చేసిన గంగవ్వ ఈ షో ద్వారా కూడా అందరిని ఆకట్టుకున్నారు. అయితే కొన్ని కారణలతో షో మధ్యలేనే బయటకు వచ్చారు. గంగవ్వ ఇళ్లు కట్టుకోవడానికి నాగార్జున సాయం కూడా చేశారు.
దీంతో బిగ్ బాస్ షో ద్వారా ఆమె సొంతింటి కళను నిరవేర్చుకున్నారు. బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చిన తరువాత కూడా గంగవ్వ తన యూట్యూబ్ ఛానల్ లో వీడియోలు పోస్ట్ చేస్తూనే ఉన్నారు. మరోవైపు సినిమాల్లో కూడా నటించే అవకాశం అందుకున్నారు. పలు సినిమాలో సైతం నటించారు. ఇన్నీ అవకాశాలు దక్కించుకున్న గంగవ్వ.. నెలకు భారీగానే సంపాదిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. యూట్యూబ్ ఛానల్ ద్వారా అన్ని ఖర్చులను పోను నెలకు లక్ష రూపాయల వరకు గంగవ్వకు ఆదాయం వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఒక రోజు సినిమా షూటింగ్ కు పదివేల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటారంట. ఏది ఏమైనా ఈ వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా ఉంటూ ఉంటూ ఇలా సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకోవడం విశేషం. ఈమె ఎందరికో ఆదర్శంగా నిలిచారు.