గంగవ్వ.. ఈ పేరు, ఈ అవ్వ తెలియని వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో లేరంటే అతిశయోక్తి కాదు. 60 ఏళ్ల వయసులో యూట్యూబ్ వీడియోలతో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది గంగవ్వ. ఇక తాజాగా గంగవ్వ, రానాతో కలిసి దావత్ చేసుకుంది. ఎందుకంటే..
సక్సెస్ ఎప్పుడు.. ఎవరిని వరిస్తుందో చెప్పడం కష్టం. ఇందుకు నిలువెత్తు నిదర్శనం గంగవ్వ. ఆరు పదుల వయసులో.. యూట్యూబ్‌ని షేక్ చేస్తోంది గంగవ్వ. స్వచ్ఛమైన తెలంగాణ యాసలో.. యూట్యూబ్ సెన్సెషన్‌గా నిలిచింది గంగవ్వ. మై విలేజ్ షో ద్వారా గంగవ్వ ప్రపంచానికి పరిచయం అయ్యింది. ఆ తర్వాత బిగ్‌బాస్ 4 ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకుంది. దాంతో ఆమెకు సినిమా అవకాశాలు కూడా పెరిగాయి. ఇస్మార్ట్ శంకర్, లవ్‌స్టోరి వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్‌లో కూడా నటించింది. ప్రస్తుతం యూట్యూబ్ వీడియోలతో, సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఫుల్ బిజీగా ఉంది గంగవ్వ. చిన్న హీరోలు మొదలు స్టార్ సెలబ్రిటీల వరకు.. అందరూ గంగవ్వ చానెల్‌లో తమ సినిమా ప్రమోషన్స్ చేసుకోవాలని భావిస్తున్నారంటే.. ఆమె క్రేజ్ ఏం రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు..
ఇక తాజాగా రానా కూడా తన సినిమా ప్రమోషన్ కోసం గంగవ్వని కలిశాడు. ఈ సందర్భంగా రానాతో కల్లు తాగించి.. రచ్చ రచ్చ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది. ప్రస్తుతం రానా సమర్పణలో మసూద ఫేమ్ తిరువీర్ హీరోగా నటించిన చిత్రం పరేషాన్. రూపక్ రోనాల్డ్‌సన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 2న విడుదల కాబోతుంది. వాల్తేర్ ప్రొడక్షన్స్‌పై సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మై విలేష్ షో టీమ్‌తో సందడి చేశాడు రానా.
పరేషాన్ టీమ్‌తో కలిసి గంగవ్వ ఊరికి వచ్చాడు రానా. పల్లెటూరి వాతావరణాన్ని బాగా ఎంజాయ్ చేశాడు. దావత్ చేసుకున్నారు. ఈ సందర్భంగా గంగవ్వ.. రానా చేత కల్లు తాగించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.