పేషంట్ కి 22 లక్షలు బిల్! తాళిబొట్టుతో సహా అమ్మేసిన భార్య!

కరోనా కష్ట కాలంలో ప్రజలను ప్రైవేట్ హాస్పిటల్స్ దోచేస్తున్నాయి. ప్రాణాలు చేతిలో పెట్టుకుని ప్రజలు హాస్పిటల్స్ కి పరుగులు తీస్తున్నారు. కానీ.., ప్రైవేట్ హాస్పిటల్స్ మాత్రం ఇదే అదునుగా ప్రజల జేబుకి చిల్లులు పెడుతున్నాయి. అంతటితో ఆగకుండా లక్షలకి లక్షలు బిల్స్ వేస్తూ.., వారిని ఆర్ధికంగా బజార్ మీదకి ఈడ్చేస్తున్నాయి. దీంతో ఆ బిల్స్ కట్టలేక కరోనా బాధిత బంధువులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో ఉన్న ఓ హాస్పిటల్ లో చోటు చేసుకుంది.కరోనా రోగి నుంచి రూ.22 లక్షలు వసూలు చేసిన తర్వాత కూడా హాస్పిటల్ యాజమాన్యం అంతటితో ఆగలేదు. మరో రూ.4 లక్షలు కడితేనే కరోనా పేషెంట్ను డిశ్చార్జ్ చేస్తామని తెగేసి చెప్పింది. కానీ అప్పటికే భర్త ట్రీట్మెంట్ అతని కోసం భార్య తాళిబొట్టుని సైతం తాకట్టు పెట్టింది. ఇప్పుడు మరో రూ.4 లక్షలు కడితే కానీ పేషెంట్ను డిశ్చార్జి చేయబోమని హాస్పిటల్ యాజమాన్యం తేల్చి చెప్పడంతో ఆ మహిళ ఏం చేయాలో తోచని దీన స్థితిలో పడిలో పోయింది.

hos 2కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని ఈ హాస్పిటల్ యాజమాన్యం చేస్తున్న దారుణాలపై ప్రశ్నించారు. కానీ.., ఇదే సమయంలో హాస్పిటల్ యాజమాన్యం మీడియాపై కూడా తమ దౌర్జ్యాన్ని ప్రదర్శించింది. దీనితో వీరి వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాలలో వైరల్ అయ్యింది. ఇదే సమయంలో ఆనందయ్య ఆయుర్వేద మందు ఉచితంగా పంపిణి చేయడం, దానికి కరోనా రోగులలో వెంటనే గుణం కనిపించడంతో సామాన్య ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆనందయ్య మందు ఉచితంగానే ఇస్తుంటేనే.. అతనిపై ఇన్ని ప్రశ్నలు గుప్పిస్తున్నారు. మరి.. 22 లక్షలు బిల్ వేసిన ప్రైవేట్ హాస్పిటల్స్ ని ప్రశ్నించారా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ ఆగడాలకి అడ్డుకట్ట వేస్తారేమో చూడాలి.