కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ధనుష్.. తనదైన నటనతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాందించాడు. ఇటీవల హీరో ధనుష్, ఐశ్వర్య విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి.. వారి అభిమానులతో పాటు అందరిని షాక్ కి గురిచేసిన సంగతి తెలిసిందే. ఇటీవల షూటింగ్ కోసం హైదరాబాద్ వెళ్లి.. ఓ రెస్టారెంట్ కి వెళ్లి లంచ్ చేశాడు. రెస్టారెంట్ లో ధనుష్ భోజనం చేస్తున్న పిక్స్ కొన్ని బయటకి వచ్చాయి. ఆ ఫొటోల్లో ఓ అమ్మాయి కూడా ఆయవ పక్కన ఉంది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆమె ఎవరు? ఆయన పక్కన కూర్చోని తినేంతా రిలేషన్ ఏముంది? అనే విషయంపై ఆరా తీస్తున్నారు.
విడాకుల విషయం ప్రక్కన పెడితే ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. సెల్వరాఘవన్ దర్శకత్వంలో “నాన్ ఒరువేన్” అనే సినిమా చేస్తూ మరొక వైపు వెంకీ అట్లూరి డైరెక్షన్ లో “వాతి” / “సార్” సినిమా చేస్తున్నాడు. మూడు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ క్రమంలో ప్రముఖ రెస్టారెంట్ కు ధనుష్ లంచ్ కి వచ్చాడు. దీనికి సంబంధించిన పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు ధనుష్ సినిమా టీమ్.
Wooooh we had a surprise guest..😀
Super thrilled to serve delightful dishes to one of the greatest actor of the generation @dhanushkraja 🤗#Dhanush #1980sMilitaryHotel pic.twitter.com/UE4ugrQL6B— 1980 Military Hotel (@1980smilitary) February 16, 2022
అయితే ఆ పిక్స్ లో ధనుష్ పక్కన కూర్చుని ఉన్న అమ్మాయి ఉంది. దీంతో ఆ యువతి ఎవరు అంటూ నెటిజన్స్ సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. కొందరేమో హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ అని అనుకున్నారు. మరికొందరు ధనుష్ టీమ్ లోని ఓ అమ్మాయి అని అంటున్నారు. దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. ధనుష్, ఐశ్వర్యలు విడాకులు తీసుకుంటునట్లు ప్రకటించిన చేసిన క్రమంలో ఇలాంటి చర్చలు జరుగుతున్నాయి. దీనిపై ధనుష్ టీమ్ నుండి ఎలాంటి సమాచారం అయితే లేదు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.