Hyderabad Crime: అదనపు కట్నం వేధింపులకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. భర్త వేధింపులతో పెళ్లైన 10 నెలలకే ప్రాణాలు తీసుకుంది. ఈ సంఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల పట్టణానికి చెందిన జూపల్లి శ్రీనివాసరావు నగరానికి వలసవచ్చారు. కూకట్‌పల్లిలోని బాలకృష్ణానగర్‌లోని ఓ ప్లాట్‌లో ఉంటున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కూతురు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోంది. పేరు నిఖిత. నిఖితకు గతేడాది జూన్ 6వ తేదీన సిరిసిల్ల పట్టణానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి చేటి ఉదయ్‌తో వివాహమైంది. వివాహ సమయంలో 10 లక్షల రూపాయల నగదు, 35 తులాల బంగారు నగలు ఇచ్చారు. అయితే, కొన్ని రోజులు బాగానే చూసుకున్న ఉదయ్.. శ్రీనివాసరావుకు సొంతూరులో ఉన్న 4.25 పొలంపై కన్నేశాడు. అందులో సంగం తన పేరున గానీ, తన తల్లిదండ్రుల పేరున గానీ, రాయాలని భార్యను వేధించటం మొదలుపెట్టాడు.
సగం భూమిని అల్లుడికి ఇవ్వటం నచ్చని శ్రీనివాసరావు.. తన మరణం తర్వాతే భూమి కూతుళ్లకు చెందుతుందని తెగేసి చెప్పాడు. దీంతో ఉదయ్ తనకు అదనపు కట్నం కావాలంటూ నిత్యం నిఖితను వేధించసాగాడు. కూతురి బాధ చూడలేకపోయిన శ్రీనివాసరావు కొన్ని రోజుల క్రితం రూ. 10 లక్షలు ఇచ్చాడు. అయినా ఉదయ్ సంతోషించలేదు. మళ్లీ వేధింపులకు దిగాడు. అతడి కుటుంబసభ్యులు కూడా నిఖిత సపోర్ట్ చేయకపోవటంతో ఆమె పుట్టింటికి వచ్చింది. ఇక అప్పటినుంచి ఫోన్‌లో భార్యను వేధించేవాడు. నిఖిత ఫోన్ తీయకపోతే మరదలు నీతకు ఫోన్ చేసి తిట్టేవాడు.
ఈ నెల 20న అత్తగారింటికి వచ్చి భార్యతో గొడవపడ్డాడు. బుధవారం రాత్రి కూడా నిఖిత, ఉదయ్‌ల మధ్య గొడవ జరిగింది. నిఖిత మెడలోని మంగళ సూత్రం తెంపి తీవ్రంగా కొట్టాడు. దీంతో మనస్తాపం చెందిన ఆమె బెడ్‌రూంలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. రాత్రి 10 గంటలు దాటినా ఆమె బయటకు రాకపోవటంతో అనుమానం వచ్చి తలుపులు బద్దలు కొట్టారు. నిఖిత ఫ్యాన్‌కు విగతజీవిలా వేలాడుతూ కనిపించింది. నిఖిత తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి కుటుంబసభ్యులు ఉదయ్ ఇంటి ముందు ఆందోళన నిర్వహించారు. తమ కూతురు చావుకు కారణమైన అల్లుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరి, లక్షల రూపాయల కట్నం ఇచ్చి.. కోటి ఆశలతో అత్తింట్లో అడుగుపెట్టిన నిఖిత జీవితం అర్థాంతరంగా ముగియటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : యువతిని వేధించిన పోకిరి.. నడిరోడ్డుపై కర్రతో చితకొట్టింది!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.