రివార్డ్ పాయింట్లతోనే కోటీశ్వరుడయ్యాడు!.. ఎలా సాధ్యం?!.

క్రెడిట్ కార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రెడిట్ కార్డుల వినియోగం రోజురోజుకీ పెరిగిపోతోంది. వీటి వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో  అదేస్థాయిలో సమస్యలు కూడా ఉంటాయి. ఇష్టానుసారంగా క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తే రుణ ఊబిలో కూరుకుపోయే ప్రమాదముంది. దీంతో మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతిని మరే ఇతర బ్యాంకుల్లో రుణాలు కూడా పొందలేకపోవచ్చు. అయితే క్రెడిట్ కార్లును తెలివిగా ఉపయోగిస్తే మాత్రం చాలా బెనిఫిట్స్ పొందొచ్చు.

Visa Cards minఅమెరికాకు చెందిన భౌతిక శాస్త్రవేత్త కాన్ స్టాంటిన్ ఆంకీవ్ క్రెడిట్ కార్డు ఎక్కువ వాడతాడు. ఈ వినియోగంలో లభించే రివార్డు పాయింట్లు డబ్బులుగా మార్చు కున్నాడు. కాన్ స్టాంటిన్ ఆంకీవ్ కు క్రెడిట్ కార్డు వినియోగంతో లభించే రివార్డు పాయింట్లు అంటే ఎంతో మక్కువ.  2009 నుంచి ఇదొక అలవాటుగా మార్చుకున్నాడు. అది కూడా చాలా తెలివిగా చేసేవాడు. ముందుగా తన క్రెడిట్ కార్డు నుండి పెద్ద సంఖ్యలో బహుమతి కార్డులను కొనడం చేస్తాడు. తర్వాత దానిని ఎన్కాష్ చేస్తాడు.

ఆంకీవ్ ఈ డబ్బును తిరిగి తన బ్యాంకు ఖాతాలో జమ చేసి, క్రెడిట్ కార్డు బిల్లును చెల్లించేవాడు.  దాదాపు 12 ఏళ్లుగా చేసి 2 కోట్లు సంపాదించాడు. పనీపాటా చేయకుండానే అంత సొమ్ము రావడంతో కొందరు అతడిపై ఐటీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ రివార్డు పాయింట్ల వ్యవహారం వెల్లడైంది.

అక్కడి చట్టాల ప్రకారం అతడికి నోటీసులు జారీ చేసారు అధికారులు. దీంతో ఇది కోర్టుకు వెళ్లడంతో అతనికి వచ్చిన డిస్కౌంట్లు – రివార్డులు  ఆదాయాలు కాదని , అతని తరపున లాయర్ వాదించాడు. అయితే బహుమతి కార్డును నగదుగా మార్చాడు కాబట్టి ఆదాయపు పన్ను చెల్లించాలని తీర్పు ఇచ్చారు.