అలస్కాలో ఇండియన్‌ ఆర్మీ, యూఎస్‌ ఆర్మీ జాయింట్‌ ట్రైనింగ్‌.. ఒళ్లు గగుర్‌పొడిచే దృశ్యాలు!

army training

అలస్కాలో ఇండియన్‌ ఆర్మీ, అమెరికా ఆర్మీ జవాన్లు సంయుక్తంగా ఒక ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌ నిర్వహించారు. రెండు ఆర్మీలకు చెందిన జవాన్లకు శిక్షణ ఇచ్చారు. దీనికి ‘యుద్ధ్‌ అభ్యాస్‌ 21’ అనే పేరు మీద శిక్షణ ఇచ్చారు. మొదటి రోజు చల్లని వాతావరణంలో ఎలా గడపాలి.. ఎలా సర్వైవ్‌ అవ్వాలి అనే కోణంలో శిక్షణ కొనసాగింది. యూఎస్‌ ఆర్మీ, భారత జవాన్లు ఒకరు ఉపయోగించే పరికరాల గురించి మరొకరు తెలుసుకున్నారు. ఎలాంటి దుస్తులు, ఎలాంటి బూట్లు వాడుతున్నారు. చలిని తట్టుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అని పరస్పరం తెలుసుకున్నారు.

ఇదీ చదవండి: షాకింగ్‌ న్యూస్‌ చెప్పిన అమెజాన్‌ ప్రైమ్‌.. పెరగనున్న సబ్‌ స్క్రిప్షన్‌ ధర!

ట్రైనింగ్‌లో భాగంగా జవాన్లకు పోటీలు కూడా నిర్వహించారు. ప్రమాదంలో ఉన్న జవాన్‌ను ఎలా రక్షించాలి. బేస్‌ క్యాంప్‌లో టెంట్‌ వేయడంపై కూడా పోటీలు నిర్వహించారు. వెపన్‌ ట్రైనింగ్‌ హెలెట్‌గా నిలిచింది. ఒకరి ఆయుధాలను ఒకరు అర్థం చేసుకోవడం.. ఉపయోగించడం చేశారు. మంచి సోదరభావ వాతావరణంలో ఈ ట్రైనింగ్‌ నడిచింది. ట్రైనింగ్‌ దృశ్యాలను ఇండియన్‌ ఆర్మీ రిలీజ్‌ చేసింది. మరి ఆ దృశ్యాలను మీరూ చూసేయండి.