ఇటీవల దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ప్రతిరోజూ పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అతి వేగం, డ్రైవర్ నిర్లక్ష్య, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.
ఇటీవల దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రమాదాలకు కారణం డ్రైవర్ల నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపడం.. కొన్నిసార్లు ప్రకృతి విపత్తు వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు భద్రతా చర్యలు ఎంత కఠిన తరం చేసినా డ్రైవర్ల తీరు మార్చుకోకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. తాజాగా జమ్మూ-కాశ్మీర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇటీవల దేశ వ్యాప్తంగా ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా జమ్మూకాశ్మీర్ లోని రాజౌరీ జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఆర్మీ జవాన్లు మరణించారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆర్మీ జవాన్లకు సంబంధించిన అంబులెన్స్ కేరి సెక్టార్ వద్ద రోడ్డు ప్రమాదానికి గురైందని, ఈ ఘటనలో ఇద్దరు ఆర్మీ జవాన్లు మరణించగా.. మరో ముగ్గురికి గాయాలు అయినట్లు అధికారులు తెలిపారు. నియంత్రణ రేఖకు సమీపంలో దుంగిగాలా సమీపంలో కి వచ్చినపుడు అంబులెన్స్ డ్రైవన్ నియంత్రణ కోల్పోవడంతో ఈ దుర్ఘటన జరిగిందని అధికారు తెలిపారు.
ఈ ప్రమాదంలో అమరులైన ఆర్మీ జవాన్లకు అండగా ఉంటామని.. గాయపడ్డ ఆర్మీ జవాన్లకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు. ఇటీవల జమ్మూకాశ్మీర్ లో పలు చోట్ల రోడ్డు ప్రమాదాలు, టెర్రరిస్టుల అటాక్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. గత ఏడాది ఆర్మీ జవాన్లతో వెళ్తున్న వాహనం సిక్కీంలో ప్రమాదానికి గురైన ఘటనలో 16 మంది ఆర్మీ జవాన్లు మరణించగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే.