నీటిలోపల పెళ్లి.. వీడియో వైరల్

పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయంటారు.. పెళ్లి అనేది మరిచిపోలేని జ్ఞాపం.. అందుకే తమ స్థాయికి మించి ఈ శుభ కార్యక్రమాన్ని జరుపుకుంటారు. ఈ మధ్య కొందరు తమ పెళ్లిని వెరైటీగా చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో విమానంలోనో, ప‌డ‌వ‌ల్లో పెళ్లి చేస్తున్న సందర్భంగాలు వెలుగు చూశాయి. కరోనా కష్టకాలంలో ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా వివాహకార్యక్రమాలు జరుగుతున్న విషయం తెలిసిందే.

తాజాగా ఇప్పుడు ఓ జంట నీటిలోపల పెళ్లి చేసుకుంది. యూకేలో చోటు చేసుకున్న ఈ పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్కూబా డైవింగ్ అంటే ఈ జంట‌కు చాలా ఇష్టం. దానిపై త‌మకు ఉన్న ప్రేమ‌ను ప్ర‌పంచానికి తెలిసేలా చేయాల‌నుకున్నారు. ఇంగ్లండ‌లోని బర్మింగ్‌హామ్ లోని మార్స్టన్ గ్రీన్ లో ఉండే బేర్ గ్రిల్స్ అడ్వెంచర్ సెంటర్ లోని వారు ఈ విధంగా పెళ్లి చేసుకున్నారు.

గత ఐదు సంవత్సరాలుగా కలిసి ఉన్న ఈ జంట వెరైటీగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ వెరైటీ పెళ్లికి ఎనిమిది మంది అతిథులు హాజరయ్యారు. నీటిలోరంగు రంగుల చేపలు సందడి చేశాయి. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.