ప్రభాస్ అభిమానులకు శుభవార్త, మూడు రోజుల్లో..

ఫిల్మ్ డెస్క్- యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు సినిమా ఇండస్ట్రీతో పాటు అభిమానుల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. బాహుబలి మూవీతో ప్రభాస్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. బాహుబలి తరువాత వచ్చిన సాహో సినిమా సక్సెస్ సాధించలేకపోయినా కలెక్షన్లు పరవాలేదనిపించింది.

ప్రస్తుతం రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న రాధేశ్యామ్ సినిమాలో నటిస్తున్నారు ప్రభాస్. రాధేశ్యామ్ మూవీకి సంబందించి ఇప్పటికే వచ్చిన ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్, టీజర్‌లు సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈ సినిమా గురించి ఈ మధ్య కాలంలో ఎటువంటి అప్ డేట్ లేకపోవడంతో ప్రభాస్ అభిమానులు అసహనంతో ఎదురుచూస్తున్నారు.

radhe shyam 2

మిగతా హీరోల సినిమాలకు సంబంధించిన అప్‌డేట్లు ఎప్పటికప్పుడు వస్తుంటే, తమ హీరో సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ఎందుకు రావడం లేదని ప్రభాస్ అభిమానులు చిత్ర యూనిట్‌పై మండిపడుతున్నారు. ఇదిగో ఇటువంటి సమయంలో రాధేశ్యామ్ సినిమా దర్శకుడు రాధాకృష్ణ తాజాగా ఓ శుభవార్త చెప్పారు. రాధేశ్యామ్ మూవీ చివరి షెడ్యూల్ కూడా పూర్తి అయిందంటూ ఆయన ట్వీట్ చేశారు.

ఈ పాండమిక్ మనందరి ఊహలను నిరాశపరిచింది.. ఎంతో ఓపికగా డార్లింగ్ ఫ్యాన్స్ అందరిపై నా ప్రేమను కురిపిస్తున్నాను.. అధికారక అప్‌డేట్ మరో మూడు రోజుల్లో వస్తుంది.. అందరం ఎదురుచూద్దాం.. అంటూ రాధాకృష్ణ ట్విట్టర్ పోస్ట్ లో వివరించారు. ఇంకేముంది వచ్చే అప్ డెట్ ఏమైఉంటుందా అని ప్రభాస్ అభిమానులు ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.