రోడ్డుపై క్యాంటిన్ లో రూపాయి భోజనం చేసిన గౌతమ్ గంభీర్

టీమిండియా మాజీ క్రికెటర్‌, బీజేపీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ తన పార్లమెంట్‌ నియోజకవర్గం ఈస్ట్‌ ఢిల్లీలో గతేడాది డిసెంబర్లో పేదల కోసం రూ.1కే భోజనం అందించే ‘జాన్‌ రసోయ్‌’ క్యాంటీన్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ఈ క్యాంటీన్లు పేదలకు చాలా ఉపయోగపడ్డాయి. నియోజకవర్గంలో మొదట ఒక క్యాంటీన్‌ ప్రారంభించిన గంభీర్‌ ఏడాది కాలంలో మరో మూడు ఏర్పాటు చేశారు. మొన్న సెప్టెంబర్‌ 17 ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా మరో క్యాంటీన్‌ కూడా ఏర్పాటు చేశారు. వేరు వేరు ప్రాంతాల్లో మొత్తం నాలుగు క్యాంటీన్లను నడుపుతున్నాడు.

Gautam Gambhir having lunch like common man - Suman TVపేదలందరూ కుల, మత, ప్రాంత తేడా లేకుండా కడుపునిండ పౌష్టికాహారం తినాలనే మంచి ఉదేశంతో జాన్‌ రసోయ్‌ క్యాంటీన్లను నడుపుతున్నట్లు పలు సందర్భంల్లో గంభీర్‌ తెలిపారు. కాగా ఆదివారం జాన్‌ రసోయ్‌ క్యాంటీన్‌ను సందర్శించిన గంభీర్‌ అక్కడే భోజనం చేశారు. ఆ ఫోటోలను తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్టు చేశారు. మీరు, నేను తినే భోజనం లాంటి మంచి రుచికరమైన భోజనమే జాన్‌ రసోయ్‌ క్యాంటీన్లలో పేదలకు అందుతుందని అన్నారు.