బుల్లెట్టు బండి పాటకు దివ్య వాణి డ్యాన్స్ అదర్స్

అమరావతి- నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తప్పా.. ఈ పాట ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మంచిర్యాలకు చెందిన కొత్త పెళ్లి కూతురు ఈ పాటపై డ్యాన్స్ చేశాక ఒక్కసారిగా బుల్లెట్టు బండి పాట బాగా వైరల్ అయ్యింది. ఈ ఒక్క డ్యాన్సుతో ఆ పెళ్లి కూతురు ఫేమస్ అయిపోయిన విషయం తెలిసిందే. ఆమె స్టెప్పులకు నెటిజన్లు ఫిదా అయ్యారు. దీంతో ఆ వధువుకు సాంగ్ నిర్మాణ సంస్థ బంపరాఫర్ కూడా ఇచ్చింది.

అప్పట్నుంచి, ఈ పాటకు వయసుతో సంబంధం లేకుండా చిన్న, పెద్ద అందరూ స్టెప్పులేస్తున్నారు. సోషల్ మీడియాలో సామాన్యుల నుంచి మొదలు సెలబ్రెటీల వరకు అంతా ఈ సాంగ్ పై డ్యాన్స్ చేస్తూ వస్తున్నారు. ఇక పెళ్లిళ్లలో ఐతే పెళ్లి కూతుళ్లంతా బుల్లెట్టు బండి సాంగ్ కు స్టెప్పులేయడం పరిపాటిగా మారిపోయింది. పెళ్లి కూతుర్లంతా వరుడు ముందు డ్యాన్స్ చేయడం ట్రెండ్‌ లా మారింది. తెలంగాణలో మొదలైన ఈ క్రేజ్.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ లో కనిపిస్తోంది.

divya vani dance 2

లక్షలాది మంది ఈ పాటకు స్టెప్పులేసి సోషల్ మీడియాలో అప్‌ లోడ్ చేస్తున్నారు. ఇక యూబ్యూట్‌ లోనూ బుల్లెట్టు బండి పాట రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్ కోట్లాది వ్యూస్‌ తో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌ లో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే పలువురు సినీ, రాజకీయ నాయకులు కూడా ఈ పాటకు స్టెప్పుల్లేస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో సీనియన్ హీరోయిన్, టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి సైతం బుల్లెట్టు బండి పాటకు డ్యాన్స్ చేసి ఔరా అనిపించారు.

తన మాటల తూటాలతో ప్రత్యర్ధి పార్టీ నేతలకు చెమటలు పట్టించే దివ్య వాణి బుల్లెట్టు బండి పాటకు స్టెప్పులేసి అలరించింది. అంతే కాదు నడిరోడ్డుపై, అందరూ చూస్తుండగా బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా అంటూ దివ్యవాణి హుషారుగా డ్యాన్స్ చేసింది. ఓ బర్త్ డే కార్యక్రమానికి హాజరైన దివ్య వాణి సన్నిహితులతో కలిసి రోడ్డుపైనే ఈ పాటకు స్టెప్పులేశారు. ఇంకేముంది దివ్య వాణి డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది