కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కరోనా

Rajnathsingh

దేశంలో కరోనా మహమ్మారి అలజడి సృష్టిస్తోంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. తాజాగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు ఉండటంతో వైద్యుల సలహాలతో ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారు కోవిడ్‌ టెస్ట్‌లు చేసుకోవాలని సూచించారు.