జార్ఖండ్ లో విషాదం.. దెయ్యం పట్టిందంటూ యువతిని మూడు నెలల పాటు..!

jamshedpur

టెక్నాలజీ యుగంలో కూడా కొంతమంది మూడ నమ్మకాలతో వారి వక్రబుద్దిని మార్చుకోవటం లేదు. నేటికి గ్రామీణ ప్రాంతాల్లో ఎవరికైన మానసిక స్థితి బాగలేక పోతే చేతబడి, దెయ్యాల నేపంతో అమానుషంగా వారిని వేధిస్తు ఉంటారు. తాజాగా అలాంటి ఘటనే జార్ఖండ్ లో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బిష్టుపుర్​లో ప్రాంతంలోని 24 ఏళ్ల యువతిని దెయ్యం పట్టిందంటూ సొంత బంధువులే దారుణంగా హింసకు గురి చేశారు.

ఇక ఈ యువతికి గత కొంత కాలం నుంచి దెయ్యం పట్టిందని కుటుంబ సభ్యులు భావించారు. ఇక ఎంతో పవిత్రంగా భావించే ఖార్ఖయి నది ఒడ్డున 30 కేజీల బరువు గల గొలుసుతో నిర్మానుష్య ప్రాంతంలో కట్టి వదిలేశారు. ఇలా మూడు నెలల పాటు ఆ యువతిని నరకయాతకు గురి చేసి ఇక్కడే కట్టేసి దారుణంగా హింసించారు. ఇక స్థానికుల సమాచారం మేరకు చాలా రోజులకు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇక ఆ యువతికి పట్టిన దెయ్యం వదులుతుందనే నమ్మకంతో బంధువులు ఇలా చేయటం ఎంత వరకు సమంజసమనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.