స్కూల్ కు వెళ్లే బాలికలను వేధిస్తూ యువకుడి పైశాచిక ఆనందం

Gedela Paadu Srikakulam Ap

ఈ మధ్యకాలంలో యువతులపై హత్యలు, ఆత్యాచారాలు విపరితంగా పెరిగిపోతున్నాయి. ప్రేమించాలని వెంటపడుతూ కాదు కూడదంటే చంపటానికి కూడా ఎనకాడటం లేదు కొందరు కంత్రిగాళ్లు. ఇదిలా ఉంటే శ్రీకాకుళం జిల్లాలోని మున్సిపాలిటీలో కాంట్రాక్ట్‌ ఉద్యోగి పని చేస్తున్న ఓ కామాంధుడు స్కూల్ కి వచ్చే బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో గ్రామస్తులు పట్టుకుని దేహశుద్ది చేశారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని జి.సిగడాం మండలం గేదెలపేట గ్రామానికి చెందిన కొందరు బాలికలు చదువుకోవటానికి పక్కనే ఉన్న పొగిరి జడ్పీ ఉన్నత పాఠశాలకు ప్రతీ రోజు వెళ్తు ఉంటారు.

ఇక స్కూల్ కు వచ్చే పోయే బాలికలపై శ్రీనివాసరావు అనే కన్నేశాడు. దీంతో రాజాం మున్సిపాలిటీలో కాంట్రాక్ట్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న కామాంధుడు ఆ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉండేవాడు. పలుమార్లు ఇదే పనిగా ఆ విద్యార్థులను వేధిస్తూ ఉండడంతో భరించలేక ఆ విద్యార్థులు తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో కాపుకాసిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆ దుర్మాగుడిని పట్టుకుని గ్రామంలో రామాలయం వద్ద స్తంభానికి కట్టేసి దేహశుద్ది చేశారు. ఇక స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.