గణేష్ నిమజ్జన వివాదం.. రాళ్లు, రప్పలతో కొట్టుకున్న గ్రామస్తులు

గణేష్ నిమజ్జనంలో భాగంగా ఓ గ్రామంలోని ప్రజలు ఒకరిపై ఒకరు రాళ్లు, రప్పలతో ఇరువర్గాలు దాడులు చేసుకున్నాయి. ఈ ఘటన ఆనంతపురం జిల్లా కుడూరు మండలం ఉదిరిపకొండ గ్రామంలో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గణేష్ నిమజ్జనంలో భాగంగా గ్రామంలోని ప్రజలు వినాయకుడిని ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఇక ఏదో చిన్నపాటి గొడవకు మాటా మాటా పెరిగి రెండు వర్గాలుగా చీలిపోయారు.

fight for ganapatiఇక మెల్ల మెల్లగా రాజుకున్న వివాదం రెండు వర్గాలు ఒక్కసారిగా దాడులు చేసుకునే స్థాయికి చేరుకుంది. ఏది దొరికితే అది..కర్రలు, రాళ్లు, రప్పలతో ఒకరిపై ఒకరు విసురుకున్నారు. ఈ దాడిలో మహిళలతో పాటు, చిన్న పిల్లలు కూడా దాడులకు తెగబడ్డారు. ఘటన స్థలంలో పోలీస్ బందోబస్తు ఉన్న ఏం చేయలేకపోయారు. ఇక ఈ దాడిలో ఐదుగురికి తీవ్రగాయలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది.