ఈ మధ్యకాలంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా ప్రేమించాలని వెంటపడడం, కాదంటే హత్యలు, అత్యాచారాలు.. ఇవే నేటి కాలంలో జరుగుతున్న దారుణాలకు ఉదాహరణలు. అయితే ఇంటర్ చదివే అమ్మాయిలపై కొందరు మగాళ్లు కలిసి ఏడిపించినా, వేదించిన పక్కనున్న ఏ ఆడ మనిషి కూడా చూస్తూ ఊరుకోదు. కానీ తమిళనాడులో మాత్రం ఓ మహిళ ఏకంగా అత్యాచారానికే చేతులు కలిపిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని శివగంగ జిల్లా కరైకుడిలో ఓ 17 ఏళ్ల బాలిక ప్రభుత్వ ఎయిడెడ్ స్కూల్‌లో 12వ తరగతి చదువుతోంది. కాగా కాలేజీలో తన స్నేహితురాలి పుట్టిన రోజు కావడంతో రెండు నెలల క్రితం వాళ్ల ఇంటికి వెళ్లింది. అలా పుట్టిన రోజు వేడుకలకు వెళ్లటంతో తన స్నేహితురాలి తల్లి ఆ బాలికతో కాస్త ప్రేమగా మాట్లాడింది. అయితే ఈ మహిళ స్థానికంగా ఉండే ఓ బ్యూటీపార్లర్‌లో మేనేజర్ గా పని చేస్తోంది. కాగా తన స్నేహితురాలితో పాటు ఆ బాలిక కూడా అప్పడప్పుడు ఆ బ్యూటీపార్లర్ కి వస్తూ ఉండేది. దీంతో ఆ బ్యూటీపార్లర్ ఓనర్ మంజిల్ ఛెత్రీ తో పాటు పని చేస్తున్న ముగ్గురు యువకులు ఆ బాలికపై కన్నేశారు.
దీంతో ఎలాగైన ఆ బాలికతో అనుభవించాలని ఆ యువకులు కలలు కంటున్నారు. ఆ బాలికను ట్రాప్ లోకి దింపటానికి బ్యూటీపార్లర్‌లో మేనేజర్ గా పని చేస్తున్న ఆ మహిళ సాయాన్ని కోరారు. ఏకంగా బ్యూటీపార్లర్ ఓనర్ అడగడంతో మంచి పేరు సంపాదించేందుకు కాదనకుండా ఆ మహిళ సరేనంటూ సైగలు చేస్తూ ఆ దిశగా అడుగులు వేసింది. దీంతో అలా ఓ రోజు ఆ మహిళ కూతురు స్నేహితురాలైన ఆ బాలికను బ్యూటీపార్లర్ కు తీసుకొచ్చింది. దీంతో ఇదే అదునుగా భావించిన ఐదుమంది యువకులు కలిసి ఆ బాలికపై అత్యాచారానికి దిగారు.
దీంతో కొన్ని రోజులుకు ఇదే విషయం ఆ బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో ఆగ్రహం ఊగిపోయారు. ఇక వెంటనే ఆ బాలిక తండ్రి స్థానికంగా ఉండే మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు అత్యాచారంలో చేతులు కలిసిన ఆ మహిళతో పాటు ఆ బ్యూటీ పార్లర్ యజమాని మంజిల్, విఘ్నేష్, హరీష్, చిరంజీవిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచనలంగా మారింది.