ఎస్సై హత్య కేసులో దొంగల ముఠా అరెస్టు

police

తమిళనాడులోని తిరుచ్చి జిల్లా నవల్ పట్టి పోలీస్ స్టేషన్ ఎస్సై భూమినాథన్ ను మేకల దొంగలు హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. హత్య చేసిన మేకల దొంగల్లో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.విధి నిర్వహణలో ఉన్న ఎస్సైను దారుణంగా హత్య చేయండంతో తీవ్రంగా పరిగణించిన తిరుచ్చి జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక బృందాలతో దర్యాప్తును వేగవంతం చేసింది. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా మణిగండన్(18) అనే మైనర్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని అరెస్టు చేసే క్రమంలో గ్రామస్తులు పోలీసులను అడుకునే ప్రయత్నం చేశారు. ప్రత్యేక బలగాల మధ్య అతడిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అతడు ఇచ్చిన సమాచారంతో మరో ఇద్దరిని పట్టుకున్నారు. మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మేకలను దొంగలించి తప్పించుకు వెళ్తున్న తమను ఎస్సై వెంబడించి పట్టుకున్నారని, వదలిపెట్టాలని ఎంతగా బ్రతిమిలాడినా వినలేదని.. తోటి సిబ్బందికి ఫోన్ చేసి త్వరగా రావాలని చెప్పడంతో భయంతో తన వద్దనున్న కత్తితో దాడి చేశానని ఓ నిందితుడు పోలీసులకు విచారణలో వెల్లడించాడు. నిందితుల ముగ్గురిని రహస్య ప్రదేశంలో ఉంచి మరింత సమాచారం కోసం విచారిస్తున్నారు.ఎస్సై కుటుంబానికి రూ. కోటి ఎక్స్గ్రేషియో

ఎస్సై మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. స్వగ్రామంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.ఈ ఘటనను సీఎం ఎంకే స్టాలిన్ తీవ్రంగా పరిగణించారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు. రూ.కోటి ఎక్స్గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తూ ప్రభుత్వం ప్రకటన చేసింది.