ప్రేమోన్మాది చేతిలో బలైన యువతి

Girl died by Boyfriend

నువ్వు లేనిదే నేను బతకలేనన్నాడు.. తనను ప్రేమించకపోతే.. చనిపోతానని వేడుకున్నాడు. చివరకు నువ్వు లేకపోతే బతకలేను అన్నవాడు.. ప్రేమించిన యువతినే బలి తీసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం లో వెలుగు చూసింది. మన్నెంపల్లి కి చెందిన పోచమ్మ, రవి దంపతులకు పిల్లలు లేకపోవడంతో వరలక్ష్మి ని దత్తత తెచ్చుకొని ఎంతో గారాభంగా చూసుకునేవారు.

ఇది కూడా చదవండి : సిటీ లో హైటెక్‌ వ్యభిచారం, ఏడుగురు అరెస్టు

Sucide

ఇంటర్మీడియట్ చదువుతున్న వరలక్ష్మి(19) కొద్దిరోజులుగా ఇంటి దగ్గరే ఉంటోంది. తరచుగా మేకలు మేపడానికి వెళ్లే వరలక్ష్మి..ఈ నెల 2న కూడా అలాగే వెళ్ళింది. రాత్రయినా తమ బిడ్డ ఇంటికి రాకపోవడంతో ఆందోళన పడ్డ తల్లిదండ్రులు పలుచోట్ల వెతికారు. అయినా ఆచూకీ దొరక్కపోవడంతో ఈ నెల 5 న పోలీసులకు ఫిర్యాదుచేశారు. దర్యాప్తులో భాగంగా వరలక్ష్మికి గతంలో పరిచయం ఉన్న పోరండ్ల గ్రామానికి చెందిన అఖిల్ (19)ను విచారించారు. దాంతో తానే వరలక్ష్మిని హత్య చేసినట్లు అంగీకరించాడు. అతడిచ్చిన సమాచారంతో చెంజర్ల సమీపంలోని గుట్టల్లో యువతీ మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. కొన్ని రోజుల నుంచి వరలక్ష్మి పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతో.. ఆమెను వదిలంచుకోవడం కోసం గొంతుకు చున్నీ బిగించి హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. అత్యాచార కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. వరలక్ష్మిని హత్యచేసిన తరువాత నిందితుడు ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు గ్రామంలోనే తిరిగినట్లు గ్రామస్థులు తెలిపారు.