ఈ మధ్య కాలంలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అనుమానాలకు గొడవలు చేసుకుంటూ నిండు జీవితాలను ఆగం చేసుకుంటున్నారు. భార్య ఎక్కువ సేపు ఫోన్ లో బిజీగా ఉన్నా.., భర్త ఎక్కువ సేపు మొబైల్ పట్టుకున్నా ఇక అంతే ఇద్దరికీ చిరెత్తుకొస్తుంది. ఇక ఇలాంటి ఘటనే హిమాచల్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం థియోగ్ ఛైలా ప్రాంతం పరిధిలోని భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. అయితే ఇటీవల భార్య వాట్సప్ చాటింగ్ లో బిజీగా ఉండటంతో భర్త పలుమార్లు హెచ్చరించే ప్రయత్నం చేశాడు. కానీ భార్య ఏ మాత్రం పట్టించుకోకుండా చాటింగ్ లో బిజీగా ఉండిపోయింది. దీంతో.. కాసుపు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తనను ప్రశాంతంగా బాయ్ ఫ్రెండ్ తో చాటింగ్ చేసుకోనివ్వా అంటూ భార్య రెచ్చిపోయింది.
పక్కనున్న కర్రతో భర్తను చితికబాదింది. ఈ గొడవలో భర్త ముందు మూడు పళ్లు ఊడిపోవటంతో స్థానిక పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు వారికి కౌన్స్ లింగ్ ఇవ్వటంతో పాటు భార్యపై ఐపీసీ 341,323,506 సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు. ఇక బాయ్ ఫ్రెండ్ తో చాటింగ్ కోసం భర్తను పళ్లు ఊడిపోయేలా చితకబాదిన ఈ భార్య తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.