‘మోసం చేసినోడిది తప్పు కాదు.. మోసపోయిన వారిదే తప్పు’ అన్న మాట కొన్ని సందర్భాల్లో నిజమే అనిపిస్తుంది. ఈరోజుల్లో ఒళ్లొంచడానికి చాలా మంది సిద్ధంగా లేరు. ఎదుటివారి అమాయకత్వం, అవసరాన్ని ఆసరాగా చేసుకుని డబ్బు చేసుకుంటున్నారు. అందుకోసం కొందరైతే పవిత్రమైన ‘పెళ్లి’ బంధాన్ని కూడా అవకాశంగా మార్చుకుంటున్నారు. అలా నిత్య పెళ్లికూతురుగా అమాయకులను మోసగిస్తున్న యువతి ఆట కట్టించారు తమిళనాడు పోలీసులు.
తమిళనాడులోని కరూర్ ప్రాంతానికి చెందిన సౌమ్య అనే మహిళ భర్తతో విడిపోయి విడిగా ఉండటం ప్రారంభించింది. తర్వాత మరో వ్యక్తిని పెళ్లాడింది. కొన్నాళ్లకు అతడిని కూడా వదేలిసింది. ఈసారి మామూలుగా వెళ్లలేదు, ఇంట్లో డబ్బు, నగలు అన్నీ తీసుకుని ఉడాయించింది. మధ్యలో ఉద్యోగాల పేరుతోనూ దందాలు చేసింది. ఇలా మొత్తం మూడు పెళ్లిల్లు, ఉద్యోగాల పేరిట మొత్తం 65 లక్షల రూపాయల వరకు డబ్బు, నగలు కాజేసింది. తాను స్థానిక మంత్రి బంధివునని చెప్పి ఉద్యోగాల ఇప్పించేందుకు కొంత డబ్బు ఇవ్వాల్సి ఉంటుందని దాదాపు 10 కుటుంబాలను మోసం చేసింది.
పోలీసుల వివారల ప్రకారం సౌమ్య తన మొదటి భర్త కాకుండా మరో ముగ్గురిని మోసం చేసింది. వారిలో ఓ పోలీసు ఆఫీసర్ కూడా ఉన్నాడు. ఆ సమయంలోనే మంత్రి బంధువుగా చెప్పుకుని ఉద్యోగార్థులను మోసం చేసింది. బాధితుడి ఫిర్యాదు మేరకు సౌమ్యను సాలెం ప్రాంతంలో పోలీసులు అరెస్టు చేశారు. తమ డబ్బు ఇప్పించాల్సిందిగా బాధితులు పోలీసులను వేడుకున్నారు. ఇలా ఎవరు ఏంటి అన్నది తెలీకుండా పెళ్లి చేసుకోవడం, ఉద్యోగానికి డబ్బులు కట్టడం ఏంటని పోలీసులు ప్రశ్నించారు. కాస్త కూడా తెలివి లేకుండా చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తి చేశారు. ఇకనైనా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.