హైదరాబాద్: తనతో ప్రాంక్ వీడియో చేసిన యూట్యూబర్ ని చావ కొట్టిన షాప్ యజమాని!

abid road police station

అదృష్టం కలసి రాకపోతే అరటి పండు తిన్నా.. పన్ను ఉడుద్ది అంటారు. ఇలా లక్ కలసి రాకపోతే సరదాగా చేసే పనులు కూడా చిక్కులు తెచ్చి పెడుతాయి. తాజాగా హైదరాబాద్ లో కూడా ఇలాంటి ఓ విచిత్ర సంఘటన చోటుకి చేసుకుంది. ప్రాంక్స్ చేసే ఓ యూట్యూబర్.. హైదరాబాద్ లోని జగదీశ్ మార్కెట్ లో ఉండే ఓ మొబైల్ షాప్ లోకి వెళ్ళాడు. అక్కడ ముందుగా తాను అనుకున్న స్క్రిప్ట్ ప్రకారం షాప్ యజమానికి చిరాకు తెప్పించాడు.

abid road police stationఅతనికి కావాలనే కోపం తెప్పించేలా బిహేవ్ చేశాడు. చివరికి ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఇంత వరకు అంతా ఆ యూట్యూబర్ అనుకున్నట్టే జరిగింది. కానీ.., ఇక్కడ నుండి యూట్యూబర్ అనుకున్న ప్రాంక్ వీడియో ఊహించని మలుపు తీసుకుంది. అప్పటికే ఆవేశాన్ని ఆపుకోలేక కంట్రోల్ తప్పిన యజమాని ఆ యూట్యూబ్ యాంకర్ ని చావకొట్టాడు.

కొట్టొద్దు బాబోయ్.., ఇది ప్రాంక్ అంటూ బతిమిలాడినా వదలలేదు. ప్రాంక్ అయితే.., ఇలా ప్రవర్తిస్తావా? ఇంకాస్త ఎక్కువ కొట్టేశాడు. ఇక విషయం తెలుసుకున్న అబిడ్స్ పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరి.. ఈ విషయంలో తప్పు ఎవరిది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.